AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గంజాయి గుట్టు తెలిస్తే ఈ నంబర్లకు కాల్ చేయండి.. ఖతం అంతే..

14500, 14400 ..శివమణి తరహాలో ఈ రెండు టోల్‌ఫ్రీ నెంబర్లు నిప్పు కణికల్లాంటివి. మీ ఏరియాలో కానీ మరెక్కడైనా కానీ గంజాయిని వాడినా..అక్రమ రవాణా చేస్తున్నట్టు తెలిసినా ఈ రెండు నెంబర్లకు ఫోన్‌ చేయండి. ఇక తగ్గేదెలా.. కన్పిస్తే ఇక కాల్చివేతే.మత్తు మరకపై ఉక్కుపాదం. మోపారు ఏపీ పోలీసులు. ఆపరేషన్‌ పరివర్తన్‌తో ఏపీలో కొత్త శకం మొదలైంది.

Andhra Pradesh: గంజాయి గుట్టు తెలిస్తే ఈ నంబర్లకు కాల్ చేయండి.. ఖతం అంతే..
Ganja in Andhra Pradesh
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2022 | 9:40 PM

Share

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా గంజాయి డెన్‌లపై మెరుపు దాడులు చేస్తున్నారు.  అక్రమార్కుల బెండు తీస్తున్నారు ఖాకీలు.. తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతున్నారు. విశాఖ- తూర్పు గోదావరి ఏజెన్సీలో గంజాయి అక్రమ సాగు, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది.  ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి దందాపై ఈ ఏడాది పోలీసులు నిఘాపెంచారు. ఆధునిక టెక్నాలజీ.. శాటిలైట్‌ ఫోటోల సాయంతో గంజాయి సాగును గుర్తించారు. వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఓవైపు గంజాయి డెన్‌లపై మెరుపు దాడులు..మరోవైపు అరెస్టులపర్వంతో కూకటివేళ్లను పెకలించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 45 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో 70 శాతం ఒడిషా నుంచి డంప్‌ అవుతున్నదే. జిల్లాల వారీగా స్వాధీనం చేసుకున్న గంజాయి ఇది. ఇప్పుడిక ఖాకీల ఆపరేషన్‌లో భాగంగా రెడీ టు ఫయిర్‌ఘట్టం మొదలైందిప్పుడు.

ఖతమ్‌ కరో గంజాయి ఫేస్‌ -2లో భాగంగా 23 డిసెంబర్‌ ..ఫ్రై డేతో ఇకపై ఏపీలో గంజాయికి డ్రై డేస్‌ మొదలయ్యాయి.. జిల్లాల వారీగా గంజాయికి నిప్పుపెట్టారు పోలీసులు. ఏలూరు రేంజ్‌లో 465 కేసుల్లో స్వాధీనం చేసుకున్న దాదాపు 65 వేల గంజాయిని స్మాష్‌ చేసేశారు.  ఇక జిల్లాల వారీగా టోటల్‌గా 2 లక్షల 45 వేల కేజీల గంజాయి దహన కార్యక్రమం కొనసాగుతోంది. ఓవైపు ఇలా ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నారు పోలీసులు. గంజాయి మాఫియా బెండు తీయడం సహా పాత నేరస్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడం.. మన్యం రైతులను అల్లం, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

గంజాయి వాడినా..సరఫరా చేసినా నేరం. ఆ ట్రాప్‌లో పడొద్దని స్కూళ్లు, కాలేజీల దగ్గర విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పోలీసులు. .గంజాయి పైన చైతన్యం కోసం హోర్డింగ్ లపైన అన్ని కాలేజీలు స్కూల్స్ వద్ద SEB టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. యువత భవితను నిర్వీర్యం చేసే గంజాయిని నిర్మూలన కేవలం పోలీసుల విధి మాత్రమే కాదు. ప్రతీ ఒక్కరి బాధ్యత. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి పర్యవేక్షణలో సక్సెస్‌ బాటలో సాగుతోన్న ఆ ఆపరేషన్‌ మరింత విజయవం వంతం కావాలంటే అందరి సహకారం అవసరం. హటావో గంజాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి