Andhra Pradesh: అమానుషం.. బరితెగించిన మృగాళ్ళు.. మైనర్ బాలుడిపై లైంగిక దాడి..!
ఆ మగాళ్లు మృగాల్లా మారారు. అభం శుభం తెలియని బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉచ్చం నీచం మరిచి పశువుల్లా ప్రవర్తించారు. న్యాయం చేయాలని సూచించిన పెద్దల మాటను పెడచెవిన పెట్టారు. బ్రతుకు తెరువు కోసం వలస వచ్చి వింత జంతువుల్లా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆ మగాళ్లు మృగాల్లా మారారు. అభం శుభం తెలియని బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉచ్చం నీచం మరిచి పశువుల్లా ప్రవర్తించారు. న్యాయం చేయాలని సూచించిన పెద్దల మాటను పెడచెవిన పెట్టారు. బ్రతుకు తెరువు కోసం వలస వచ్చి వింత జంతువుల్లా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వారిది ప్రకాశం జిల్లా సంతమాగులూరు. వ్యవసాయ పనులు నిమిత్తం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వచ్చారు. పన్నేండేళ్ల కొడుకును తమతో పాటు తీసుకొచ్చుకున్నారు. వలస కూలీలుగా మిర్చి పొలంలో పనిచేస్తూ అక్కడే జీవిస్తుంటారు. బాలుడి తల్లిదండ్రులు ఉదయాన్నే పొలానికి వెళ్లి మధ్యాహ్న సమయంలో తిరిగి తమ గూటికి చేరుకుంటారు. అప్పటి వరకూ ఆ బాలుడే ఇంటి వద్దే ఉంటాడు. ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా నుండే వలస వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు గమనించారు. రెండు రోజుల క్రితం తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్లిన బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ విషయం ఎవరికి చెప్పవద్దంటూ బాలుడిని చందు, కోటేశ్వరావు, కామేశ్వరావు అనే ముగ్గురు హెచ్చరించారు. దీంతో బాలుడి మరింతగా భయాందోళనకు గురయ్యాడు. అయితే బాలుడికి తీవ్ర రక్త స్రావం అవ్వటంతో తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో బాలుడి తనపై జరిగిన దాడి వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆ ముగ్గురిపై గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టారు. బాలుడికి వైద్యం అందిస్తామని అందుకు అయ్యే ఖర్చులు భరిస్తామని, ఎటువంటి కేసులు లేకుండా చూడాలంటూ పెద్దల వద్ద మోకరిల్లారు. దీంతో పంచాయితీ తీర్పు వారికే అనుకూలంగా వచ్చింది. ఇక అందరూ అక్కడ నుండి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఆ మోసగాళ్లు మాట మార్చారు. ఎటువంటి వైద్యం చేయించమని, చేతనైంది చేసుకోండి అంటూ హెచ్చరించడం మొదలు పెట్టారు. మరోవైపు బాలుడి ఆరోగ్యం మరింతీ క్షిణించింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుడి బ్రతికించుకునేందుకు హాడావుడిగా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరిగిన విషయం మొత్తం అందరికి తెలిసిపోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వైద్యులు బాలుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…