AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉందా.? ఈ పంట వేస్తే లక్షలు కాదు.. ఏకంగా కోట్లు సంపాదించొచ్చు.!

రోజురోజుకూ వ్యవసాయ రంగంలో నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో కొందరు యువ రైతులు విదేశాలలో పండించే పంటలను సైతం మన ప్రాంతాలలో పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు. అంతేకాకుండా పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ..

మీ ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉందా.? ఈ పంట వేస్తే లక్షలు కాదు.. ఏకంగా కోట్లు సంపాదించొచ్చు.!
Money
B Ravi Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 21, 2024 | 6:25 PM

Share

రోజురోజుకూ వ్యవసాయ రంగంలో నూతన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో కొందరు యువ రైతులు విదేశాలలో పండించే పంటలను సైతం మన ప్రాంతాలలో పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు. అంతేకాకుండా పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ.. వారికి సైతం ఆ కొత్తరకం విదేశీ పండ్ల సాగు చేయడంలో మెళుకువలను వివరిస్తూ వ్యవసాయాన్ని పండగలా మార్చే ఆలోచన చేస్తున్నాడో యువ రైతు. ఇంతకీ అంత ఎక్కువ లాభాలు తీసుకొచ్చే విదేశీ పండ్ల సాగు ఏంటని అనుకుంటున్నారా.? దాని కెందుకంత డిమాండ్..! ఏ దేశాలలో ఆ పండ్ల సాగు చేస్తారు..! ఈ వివరాలు ఇపుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా పోలవరం మండలం మామిదిగుండు గ్రామానికి చెందిన యువ రైతు వెంకట్.. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న గ్యాక్ ఫ్రూట్(Gac Fruit) పంటను పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. తనకున్న కొద్దిపాటి ప్రాంతంలో పండ్ల సాగు చేస్తున్నాడు వెంకట్. వియత్నాంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన పండ్ల సాగు గ్యాక్‌ ఫ్రూట్‌. దీనిని హెవెన్‌ ఫ్రూట్‌‌గా పిలుస్తారు. ముఖ్యంగా వియత్నాం, మలేషియా, థాయిలాండ్‌ దేశాలలో ఈ పంటను సాగు చేస్తున్నారు. వియత్నాం, చైనా దేశాలలో సంప్రదాయ వైద్య విధానంలో గ్యాక్ ఫ్రూట్ రసాలను ఉపయోగిస్తారు. ఈ పండు బీటా కెరోటిన్, ఒమేగా, కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. మనదేశంలో గ్యాక్‌ ఫ్రూట్‌ను కేరళ రాష్ట్రంలో పండిస్తున్నారు. అయితే వెంకట్ గ్యాక్‌ ఫ్రూట్‌ పంట సాగును సోషల్ మీడియాలో చూసి ఆ పంటను తమ ప్రాంతంలో పండించాలనుకున్నాడు.

కేరళలో ఈ పంటను పండించే రైతులను సంప్రదించి అక్కడ నుంచి మొక్కలను తెప్పించాడు. తన ఇంటి ఆవరణలో గల 1000 గజాల స్థలాన్ని పంట సాగుకు సిద్దం చేశాడు. 300 మొక్కలను కేరళ నుంచి తీసుకువచ్చాడు. అయితే అది తీగజాతి మొక్క కావడంతో ఎంచుకున్న స్థలంలో సాంప్రదాయ పద్ధతుల్లో పందిళ్లు ఏర్పాటు చేసి గత సంవత్సరం నవంబర్‌లో మొక్కలు నాటాడు. అయితే ఈ పండులో ప్రత్యేక లక్షణం ఉంది. దాని పక్వదశను వివిధ రకాల రంగుల్లో అది మనకు కనిపిస్తుంది. ప్రకాశవంతమైన ఎరుపురంగులోకి మారినప్పుడు పంట కోయడానికి సిద్ధంగా ఉందని గుర్తించవచ్చు. అలాగే ఈ మొక్కలలో ఆడ, మగ రకాలు ఉంటాయి. రైతులు పంటపొలాల్లో వీటిని పక్కపక్కనే నాటితే పరాగసంపర్కం చెందుతాయి. సహజంగా కీటక పరాగసంపర్కానికి బదులుగా చేతితో మొక్కలను పరాగసంపర్కం చేసినప్పుడు మెరుగైన దిగుబడి వస్తుంది. ఈ పండు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర పలుకుతుంది. కిలో గ్యాక్ ఫ్రూట్ పండ్ల ధర రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉంది. అధిక ధరతో పాటు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటం పంట సాగుపై రైతు వెంకట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించి ఎక్కువ లాభాలు వచ్చే పంటగా దీన్ని రైతులు పండిస్తే బాగుంటుందని యువ రైతు వెంకట్ భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..