Children Missing: తల్లితోపాటు చెరువు దగ్గరకు వెళ్లి కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు

అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలక వారి పల్లి ఎగువ తండాలో విషాదం నెలకొంది. తాండ సమీపంలోని చెరువు దగ్గరకు తల్లి బట్టలు ఉతకడానికి వెళ్తుండగా

Children Missing: తల్లితోపాటు చెరువు దగ్గరకు వెళ్లి కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు
Anantapuram 3

Anantapuram: అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలక వారి పల్లి ఎగువ తండాలో విషాదం నెలకొంది. తాండ సమీపంలోని చెరువు దగ్గరకు తల్లి బట్టలు ఉతకడానికి వెళ్తుండగా ముగ్గురు చిన్నారులు తన తల్లితో పాటు చెరువు వద్దకు వెళ్లారు. అయితే, తల్లి బట్టలు ఉతుకుతుండగా, పిల్లలు ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. అయితే, అటుగా వెళ్తున్న గొర్రెల కాపరి ‘మీ పిల్లలు చెరువులోకి దిగుతున్నారు’ అని తెలపాడు.

Anantapuram

దీంతో అప్రమత్తమైన తల్లి హుటాహుటీన చుట్టుపక్కలంతా వెతికడం ప్రారంభించింది. ఎంత వెతికినా చిన్నారులు కనిపించకపోవడంతో గ్రామస్తులకు తెలియజేసింది. కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి గల్లంతయ్యారా లేదా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో సీతాఫలం పళ్ళ కోసం వెళ్లారా అన్న అనుమానంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

Anantapuram 2

సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొన్న గ్రామస్తులు చెరువులోకి దిగి తీవ్రంగా గాలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు కనిపించకపోవడంతో ఏం జరిగిందో అన్న భయంతో గ్రామంలో విషాదం వాతావరణం అలముకుంది.

Anantapuram 3

Read also: Chandrababu: కమీషన్ల కోసమే విద్యుత్ కొరత..! హౌస్ సైట్స్ మీద వైసీపీ నేతలతోనే కోర్టులో కేసులు: చంద్రబాబు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu