Fire In Car: చూస్తుండగానే కారులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే..
ఈ మధ్య కాలంలో వాహనాల్లో మంటలు రావటం సాధారణం అయిపోయింది. గత సెప్టెంబర్ 29న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఓ కారు దగ్ధమైంది...
ఈ మధ్య కాలంలో వాహనాల్లో మంటలు రావటం సాధారణం అయిపోయింది. గత సెప్టెంబర్ 29న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఓ కారు దగ్ధమైంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు గూడూరు టోల్ ప్లాజా వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగి దూరంగా వెళ్లారు. అంతకుముందు రోజు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 10లో వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్.. తక్షణే కారును ఆపి బయటకు దిగేశాడు.
తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వై జంక్షన్ వద్ద విజయవాడ వైపు వెలుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న ఎవరికీ గాయాలు కాకుండా బయట పడ్డారు. గుంటూరు నుంచి ఓ డీఎస్పీ తన కుటుంబ సభ్యులతో ఫోర్డ్ కారులో విజయనగరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వై జంక్షన్ వద్ద రాగానే కారు ఇంజన్లో మంటలు వ్యాప్తి చెందడంతో కారులో ప్రయాణిస్తున్న వారు బయటకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు రావడానికి షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
Read Also.. Snakebite: పాము కాటుతో చనిపోయిన భార్య.. దానికి కారణం భార్తేనని కోర్టు నిర్ధారణ..