IPL 2021 RCB vs KKR Match Highlights : బెంగుళూరుపై విజయకేతనం ఎగరవేసి.. క్వాలిఫయర్‌కు చేరిన మోర్గాన్ సేన..

Royal Challengers Bangalore vs kolkata knight riders Live Updates: ఐపీఎల్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో క్రికెట్‌ ప్రేమికుల్లో ఉత్కంఠ మరింత ఎక్కువుతోంది. ఇంకా కేవలం మూడు మ్యాచ్‌ల..

IPL 2021 RCB vs KKR Match Highlights : బెంగుళూరుపై విజయకేతనం ఎగరవేసి.. క్వాలిఫయర్‌కు చేరిన మోర్గాన్ సేన..
Ipl 2021 Rcb Vs Kkr

Royal Challengers Bangalore vs kolkata knight riders Highlights: ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. ఇక 139 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 6 వికెట్లు నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా, సునీల్ నరైన్ రాణించడంతో ఆ జట్టు అద్భుత విజయాన్ని అందుకుని క్వాలిఫైయర్-2లో ఢిల్లీతో తలబడనుంది. ఇక ఈ ఓటమితో బెంగళూరు ఇంటి ముఖం పట్టింది. 

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ గెలవడానికి భారీ స్కోరు అవసరమైనే నేపథ్యంలో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెంటనే ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే మొదటి నుంచి భారీ షాట్‌లతో జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డారు. అయితే వరుస వికెట్‌లు కోల్పోగానే జట్టు స్కోరు ఒక్కసారిగా నెమ్మదించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్‌లలో ఏడు వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 138 పరుగులు చేసింది. దీంతో కోలక్‌తా విజయానికి 139 పరుగులు చేయాల్సి ఉంది.

ఇందులో గెలిచిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. అందులో ఏ జట్టు గెలుస్తుందో అది చెన్నైతో ఫైనల్‌లో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై సహజాంగానే ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లీ ఐపీఎల్‌ నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో విజయంతో వీడ్కోలు చెప్పాలని కోహ్లీ కసిగా ఉన్నాడు. ఇక ఇప్పటికే రెండు సార్లు టైటిల్ గెలుచుకున్న కేకేఆర్‌ ఇప్పుడు మరోసారి టైటిల్‌పై గురి పెట్టింది.   ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్‌  విజయం సాధించింది.

ఇరు జట్ల ప్లేయర్స్‌..

కేకేఆర్‌:

ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.

ఆర్‌సీబీ:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, ఎస్. భరత్ (కీపర్‌), డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టెన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

 

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
 • 11 Oct 2021 23:06 PM (IST)

  ఆర్సీబీ మీద కేకేఆర్ విజయం

  కేకేఆర్ విజయం.. ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేసిన కేకేఆర్..

 • 11 Oct 2021 22:54 PM (IST)

  ప్రస్తుతం క్రీజ్ లో ఎవరున్నారంటే..

  17 ఓవర్లు పూర్తయ్యే సరికి  కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. రాస్తుతం క్రీజ్ లో సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ ఉన్నారు.

 • 11 Oct 2021 22:52 PM (IST)

  15 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ ఎంతంటే

  కేకేఆర్  నిలకడగా ఆడుతుంది ఈ క్రమంలో 15 ఓవర్లకు112 పరుగులు సాధించింది. అలాగే 4 వికెట్లు కోల్పోయింది.

 • 11 Oct 2021 22:10 PM (IST)

  రెండు వికెట్లు కోల్పోయిన కోల్‌కత్తా

  నిలకడగా ఆడుతున్న కోల్‌కత్తా.. రాహుల్ త్రిపాఠి 6 పరుగులకు అవుట్ అయ్యాడు. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది

   

 • 11 Oct 2021 21:56 PM (IST)

  తొలివికెట్ కోల్పోయిన కోల్‌కతా..

  స్వల్ప లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కోల్‌కతా తొలి వికెట్‌ను కోల్పోయింది. హర్షల్‌ పటేల్‌ విసిరిన బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన శుభమన్‌ గిల్‌, డివిలర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు.

 • 11 Oct 2021 21:48 PM (IST)

  ఆచితూచి ఆడుతోన్న కేకేఆర్‌ బ్యాట్స్‌మెన్‌..

  ఆర్‌సీబీ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఆచితూచి ఆడుతోంది. ఇద్దరు ఓపెనర్లు రాణించడంతో జట్టు 8 రన్‌రేట్‌తో దూసుకుకెళుతున్నారు. 5 వికెట్ల నష్టానికి ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 40 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో గిల్‌ (29), వెంకటేష్‌ అయ్యర్‌ (12) పరుగులతో ఉన్నారు.

 • 11 Oct 2021 21:43 PM (IST)

  తడబడ్డ బెంగళూరు బ్యాట్స్‌మెన్‌..

  కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్‌లలో ఏడు వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 138 పరుగులు చేసింది. దీంతో కోలక్‌తా విజయానికి 139 పరుగులు చేయాల్సి ఉంది.

 • 11 Oct 2021 20:43 PM (IST)

  మరో వికెట్‌ గాన్..

  బెంగళూరు మరో వికెట్‌ కోల్పోయింది.. సునీల్‌ నరైన్‌ విసిరిన 14.2 బంతికి డివిలయర్స్‌ బౌల్డ్‌ అయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్‌సీబీ నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో షాబాజ్ అహ్మద్ (5), గ్లెన్ మాక్స్‌వెల్ (13) పరుగులతో కొనసాగుతున్నారు.

 • 11 Oct 2021 20:33 PM (IST)

  బిగ్‌ వికెట్ గాన్‌..

  img

  జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డ విరాట్‌ కోహ్లీ అవుట్‌ అయ్యాడు. సునీల్ నరైన్ విసిరిన 12.2 బంతికి బౌల్డ్‌ అయి పెవిలియన్‌ బాట పట్టాడు.

 • 11 Oct 2021 20:29 PM (IST)

  జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డ కోహ్లీ..

  వెంట వెంటనే ఆర్‌సీబీ రెండు వికెట్లు కోల్పోవడంతో జట్టు సారథి కోహ్లీ స్కోరును పెంచే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే 32 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీ జట్టు స్కోరు 12 ఓవర్‌లు ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 88 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ ( 39 ), మ్యాక్స్‌వెల్‌ ( 10 ) పరుగులతో కొనసాగుతున్నారు.

 • 11 Oct 2021 20:21 PM (IST)

  రెండో వికెట్‌ గాన్‌..

  ఆర్‌సీబీ రెండో వికెట్‌ను కోల్పోయింది. 9 బంతుల్లో 16 పరుగులు సాధించి జట్టు స్కోరును పెంచే పనిలో పడ్డ శ్రీకర్‌ భరత్‌, వెంకటేష్‌ అయ్యర్‌ బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

 • 11 Oct 2021 19:58 PM (IST)

  తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ..

  భారీ స్కోరు చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు తొలి వికెట్‌ను కోల్పోయింది. భారీ షాట్‌లతో స్కోరును పెంచే పనిలో పడ్డ దేవదత్‌ పడిక్కల్‌ 21 పరుగుల వద్ద లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో బోల్డ్‌ అయ్యాడు.

 • 11 Oct 2021 19:54 PM (IST)

  ఆర్‌సీబీకి మంచి ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు..

  కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్‌సీబీ బ్యాట్సెమెన్‌ ఆచితూచి ఆడుతున్నారు. చాన్స్‌ దొరికినప్పుడల్లా బౌండరీ బాదుతూ జట్టు స్కోరును పెంచుతున్నారు. ఈ క్రమంలోనే 5 ఓవర్‌లకు ఆర్‌సీబీ ఎలాంటి వికెట్లు నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (22), దేవదత్‌ పడిక్కల్‌ (21) పరుగులతో కొనసాగుతున్నారు.

 • 11 Oct 2021 19:37 PM (IST)

  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్‌సీబీ..

  కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇలా కోల్‌కతా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే క్రమంలో బెంగళూరు బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లనిపిస్తోంది.

 • 11 Oct 2021 19:33 PM (IST)

  ఇరు జట్ల ప్లేయర్స్‌..

  కేకేఆర్‌:

  ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.

  ఆర్‌సీబీ:

  విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, ఎస్. భరత్ (కీపర్‌), డేనియల్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టెన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

 • 11 Oct 2021 19:01 PM (IST)

  ఇరు జట్లలో ఎవరు ముందున్నారంటే..

  రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు, కోల్‌కతా నైడ్‌ రైటర్స్‌లో ఇప్పటి వరకు ఐపీఎల్‌ చరిత్రలో 29సార్లు తలపడ్డాయి. వీటిలో కేకేఆర్‌ 15 సార్లు గెలిస్తే, బెంగళూరుకు 13 విజయాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో చివరిగా తలపడ్డ మ్యాచ్‌లో రెండు జట్లు చేరో విజయాన్ని దక్కించుకున్నాయి. దీనిబట్టి చూస్తే ఈ రెండు జట్ల మధ్య వార్ చాలా టఫ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu