MS Dhoni: తన చిన్నారి అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ధోని.. అదేమిటంటే..
దుబాయ్‌లో ఆదివారం జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్‌తో పాత ధోనిని గుర్తుకు తెచ్చాడు..
దుబాయ్‌లో ఆదివారం జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్‌తో పాత ధోనిని గుర్తుకు తెచ్చాడు. దీంతో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో ఢిల్లీని ఒడించి మరోసారి ఫైనల్‌కు వెళ్లింది. ధోనీ ఆరు బంతుల్లో 18 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు తీసుకెళ్లాడు. నెంబర్ అనేది వయస్సకే తప్ప ఆటకు లేదని చాటిచెప్పాడు. అయితే ధోని చివర్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించడంతో సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే కాకుండా స్టాండ్‌లలో కూడా భావోద్వేగాలు పెరిగాయి. చెన్నై ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించడంతో ఇద్దరు చిన్నారి అభిమానులు తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇది గమనించిన ధోని వారికి ఓ గిఫ్ట్ ఇచ్చాడు.
ధోని అని సంతకం చేసిన బంతిని వారికి విసిరాడు. ఆ బంతిని పట్టుకున్న వారి సంతోషనికి అవధులు లేకుండా పోయింది. ఆనందంతో గంతులు వేశారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. పృథ్వీషా 34 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 35 బంతుల్లో 51 పరుగులు చేశారు. 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ రాబిన్, ఉతప్ప బాగానే ఆడారు. కానీ ఉతప్ప ఔట్ అయిన తర్వాత చెన్నై రెండు వికెట్లు వెనువెంటనే కోల్పోయింది. సాధించాల్సిన రన్ రేట్ కూడా పెరిగింది. చెన్నైకి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు అవసరం కావడంతో ఆ జట్టు గైక్వాడ్‌పై ఆధారపడింది. అయితే ఆ సమయంలో మోయెన్ అలీ కూడా వెనుదిరిగాడు.. దీంతో ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చిరాగానే మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. టామ్ కరన్ బౌలింగ్‌లో ధోనీ వరుసగా మూడు ఫోర్లు కొట్టి చెన్నైకి విజయాన్ని అందించాడు.
Sweetest Gesture by Mahi, gave signed ball to the kids who was emotional over #CSK win ? #Dhoni pic.twitter.com/bGja3Cg83P
— Ash MSDian™ ?? (@savagehearttt) October 11, 2021
. @MSDhoni is an Emotion. ♥️pic.twitter.com/6ZGsyej71F
— Dhoni Tharane 4⃣ ᴱᵀ ? (@TharaneTalks) October 10, 2021
Read Also..Virat Kohli: టీ20ల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు బ్రేక్.. ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.!