AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త భయం.. వరుస దారుణాలతో హడలిపోతున్న జనాలు.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ముఠాలు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఠాల ఆగడాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త భయం.. వరుస దారుణాలతో హడలిపోతున్న జనాలు.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..!
Thieves
Shiva Prajapati
|

Updated on: Dec 06, 2021 | 8:54 AM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ముఠాలు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఠాల ఆగడాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పులివెందుల నుంచి గుండుగొలను వరకు వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస ఘటనలు చూసి జనాలు హడలిపోతున్నారు. రెండున్నర నెలల క్రితం పులివెందులలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వారిని తాళ్లతో కట్టేసి బంగారు నగలు అపహరించుకుపోయారు. తిరుపతిలోనూ ఇదే తరహాలో అరకేజీ బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఇక అనంతపురం జిల్లా కదిరిలో నవంబరు 16న ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. మరో మహిళను తీవ్రంగా గాయపరిచి బంగారం, నగదు దోచుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్ధ దంపతుల్ని హత్యచేసి, భార్య చెవులు కోసి కమ్మలు లాక్కెళ్లారు దొంగల ముఠా. ఇటీవల టంగుటూరులో పీఎస్ కూతవేటు దూరంలోని ఓ ఇంట్లోకి రాత్రి 8గంటల ప్రాంతంలో దొంగలు చొరబడ్డారు. తల్లి, కుమార్తెల గొంతు కోసి బంగారం, నగదు చోరీ చేశారు.

ఇక పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో నిద్రలో ఉన్న మహిళ ముఖంపై దిండు పెట్టి హత్య చేశారు. మంగళసూత్రాలు, చెవి కమ్మలతో పాటు బీరువాలో నగదుతో దుండగులు పరారీ అయ్యారు. అయితే, హైదరాబాద్ లాంటి నగరాల్లో హల్చల్ చేసే చెడ్డీ గ్యాంగ్ తాజాగా విజయవాడలో ప్రత్యక్షం అవడం.. చోరీకి పాల్పడటం తెలిసిందే. ఈ క్రమంలోనే చిట్టినగర్, గుంటుపల్లిలో పరిధిలో వరుస దోపిడీలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిల్లోనూ ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఈ వరుస భయానక చోరీలు.. ప్రజలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ దొంగల ముఠాలను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు. కాగా, రాష్ట్రంలో చోరీ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దొంగల ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వాటి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

Also read:

Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..

Greta E Scooters: బడ్జెట్ ధరల్లో గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు..!(వీడియో)

Omicron Variant-Third Wave: భారత్ లో ఒమిక్రాన్ విలయతాండవం.. అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..(వీడియో)

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..