Andhra Pradesh: పెళ్లి ఇంట్లో భారీ చోరీ.. మొబైల్ సిగ్నల్ ఆధారంగా నగలు గుర్తించిన పోలీసులు..
AP News: పెళ్లి వేడుక అంటే.. ముందుగా గుర్తుకొచ్చేది.. చీరలు , నగలు. పెళ్లికూతురు దగ్గర నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలి...
Andhra Pradesh News: పెళ్లి వేడుక అంటే.. ముందుగా గుర్తుకొచ్చేది.. చీరలు , నగలు. పెళ్లికూతురు దగ్గర నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలి. ఏ నగలు పెట్టుకోవాలని ఆలోచిస్తారు. అందమైన బుట్టబొమ్మల్లా రెడీ అవుతారు. అంతేకాదు.. హిందూ సంప్రదాయంలో పెళ్లిలో పెళ్ళికూతురికి ఇటు పుట్టింటి వారు, అటు అత్తింటివారు తమ శక్తి కొలదీ నగలు పెట్టడం ఆనవాయతీగా ఎప్పటినుంచో వస్తున్నదే. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటే.. నగలు, డబ్బులు తప్పనిసరిగా ఉంటాయి. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ దొంగ పెళ్లింట్లో దొంగతనం చేశాడు. లక్షలు విలుజేసే నగలతో పాటు డబ్బులను కూడా దోచుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సీతయ్యగారి తోట విద్యుత్ నగర్ లో పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సత్తిబాబు అనే ఉపాధ్యాయుడు ఇంట్లో శుక్రవారం రాత్రి సుమారు రూ. 80 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, రూ.4 లక్షలు నగదను దొంగ అపహరించుకుపోయాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ లభించిన క్లూస్ ను సేకరించారు. నిందితుడు పాత నేరస్తుడు గా గుర్తించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలింపు చర్యలు చెపట్టారు. దొంగకు తనకోసం పోలీసులు గాలిస్తున్నట్లు అనుమానం వచ్చినట్లు ఉంది ఏమో.. ఎఫ్ కె పాలెం లో బంగారు నగలు వదిలి పరారైపోయాడు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఎఫ్.కె పాలెం లో నగలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం దొంగ కోసం గాలిస్తున్నారు.
Also Read: మార్గశిర పున్నమి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఆర్ధిక కష్టాలు తీరతాయట.