Andhra Pradesh: ఉల్లి రైతు గుండె మండింది.. చెమటోడ్చి పండించిన పంటకు నిప్పుపెట్టాడు.. వాచ్ వీడియో

కర్నూల్ జిల్లా మార్కెట్ యార్డులో హృదయం తరుక్కుపోయే సీన్ కనిపించింది. ఓ ఉల్లి రైతు తన పండించిన పంటను ఎంతో ఆశతో మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు.

Andhra Pradesh: ఉల్లి రైతు గుండె మండింది.. చెమటోడ్చి పండించిన పంటకు నిప్పుపెట్టాడు.. వాచ్ వీడియో
ఉల్లి సంచులకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన రైతు
Follow us

|

Updated on: Dec 11, 2021 | 6:45 PM

కర్నూల్ జిల్లా మార్కెట్ యార్డులో గుండె తరుక్కుపోయే సీన్ కనిపించింది. ఓ ఉల్లి రైతు తన పండించిన పంటను ఎంతో ఆశతో మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు. ప్రస్తుతం ధరలు నేల చూపులు చూస్తున్న నేపథ్యంలో కనీసం పెట్టుబడి ఖర్చులు అయినా వస్తాయని ఆశించాడు. కానీ అక్కడ మాత్రం క్వింటాల్ ఉల్లికి రూ. 600 మాత్రమే చెల్లిస్తామని వ్యాపారులు తెలిపారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తీసుకొచ్చిన ఉల్లి సంచులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మార్కెట్ లో ఉల్లికి గిట్టుబాటు ధర లభించండం లేదంటూ ఆందోళనకు దిగాడు. ఈ-నామ్‌లో కొంతమందికి మాత్రమే మంచి ధరలు లభిస్తున్నాయని, మిగతా రైతుల పంటకు మద్దతు ధర లభించడం లేదని వాపోయాడు. సదరు రైతు పంచ లింగాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా తెలిసింది.

చెమటోడ్చి పండించి…  అమ్మకానికి తెచ్చిన తన ఉల్లి బస్తాలపై పెట్రోల్ పోసి మార్కెట్‌లోనే నిప్పు పెట్టాడు వెంకటేశ్వర్లు. నష్టానికి పంట అమ్ముకోలేక తన ఉల్లికి నిప్పు పెట్టానంటూ బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే తోటి రైతులు మంటలు ఆర్పేసి.. రైతు వెంకటేశ్వర్లుకి సర్ది చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశాడు.

Also Read: Andhra Pradesh: ఆశ్చర్యం.. ఏపీలో పెరిగిన మునక్కాడల ధర.. కేజీ ఏకంగా రూ.600

నదిపై తేలియాడుతూ వచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్