AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఇలాంటి విషాదం పండుగ పూట ఎవరి ఇంట్లో జరగొద్దు.!

పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి దారుణ పరిస్థితుల్లో తల్లి మరణించింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో చోటు చేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న మహిళకు నొప్పులు రావడం ఆసుపత్రికి తీసుకెళ్ళె దిక్కులేక ఇంట్లోనే ప్రసవం జరిగి బిడ్డకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తస్రావమై తల్లి మరణించింది.ఘోరం జరిగిన కొద్ది సేపటికి భర్త వచ్చి చూస్తే రక్తపుమడుగులో భార్య, గుక్కపట్టి ఏడుస్తూ మగబిడ్డ కనిపించడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

AP News: ఇలాంటి విషాదం పండుగ పూట ఎవరి ఇంట్లో జరగొద్దు.!
Mother Died In Terrible Circumstances
Fairoz Baig
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 12, 2024 | 8:19 PM

Share

పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి దారుణ పరిస్థితుల్లో తల్లి మరణించింది. ఈ ఘటన బాపట్ల జిల్లా వేటపాలెంలో చోటు చేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న మహిళకు నొప్పులు రావడం ఆసుపత్రికి తీసుకెళ్ళె దిక్కులేక ఇంట్లోనే ప్రసవం జరిగి బిడ్డకు జన్మనిచ్చింది. తీవ్ర రక్తస్రావమై తల్లి మరణించింది.ఘోరం జరిగిన కొద్ది సేపటికి భర్త వచ్చి చూస్తే రక్తపుమడుగులో భార్య, గుక్కపట్టి ఏడుస్తూ మగబిడ్డ కనిపించడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సర్యోదయ కాలనీలో చోటుచేసుకుంది. మట్టం కోటేశ్వరి(30) వెంకట్రావు దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న కోటేశ్వరి తన భర్త, పిల్లలతో కలిసి వేటపాలెం మండలంలోని సర్వోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. నెలలు నిండిన గర్భిణీగా ఉన్న భార్య ఇంట్లో ఒంటరిగా ఉండగా భర్త బయటకు పనికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి తీవ్ర రక్తస్రావంతో భార్య మగ బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందినట్టు గుర్తించి ఒక్కసారిగా కుప్పుకూలిపోయాడు. దిక్కు తోచని స్థితిలో ఆశా వర్కర్లకు సమాచారం అందించడంతో వాళ్ళు మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాల తరలించారు. అలాగే బిడ్డకు ఏరియా హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వేటపాలెం పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, చైల్డ్‌ హెల్ప్ లైన్ ప్రతినిధులు విషయాన్ని సంయుక్తంగా పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి