Vijayawada: ఈవో వర్సెస్ ఛైర్మన్.. దుర్గమ్మ గుడిలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అంతర్గత బదిలీల విషయంలో..
బెజవాడలో కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడూ ఏదో వివాదం బయటకు వస్తునే ఉంటుంది. శాకంబరీ ఉత్సవాల వేళ మరోసారి చైర్మన్, ఈవో మధ్య విభేదాలు బయటపట్టడాయి. ఈవో భ్రమరాంబ తీరుపై అసహనం వ్యక్తం చేశారు చైర్మన్ కర్నాటి రాంబాబు
బెజవాడలో కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడూ ఏదో వివాదం బయటకు వస్తునే ఉంటుంది. శాకంబరీ ఉత్సవాల వేళ మరోసారి చైర్మన్, ఈవో మధ్య విభేదాలు బయటపట్టడాయి. ఈవో భ్రమరాంబ తీరుపై అసహనం వ్యక్తం చేశారు చైర్మన్ కర్నాటి రాంబాబు. దుర్గగుడి అంతర్గత బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాల్లోకి బదిలీ చేశారు ఈవో. బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బందిని మార్చేశారు. కానీ శాకంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో చార్జ్ తీసుకోలేదు సీసీ.. ఇద్దరు అటెండర్లకు గాను ఒక్క అటెండర్‌ను మాత్రమే ఇవ్వడంతో ఈవో పై చైర్మన్, పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ బదిలీలపై ఈవో భ్రమరాంబ స్పందించారు. నిబంధనలకు అనుగుణంగానే ఈ బదిలీలు చేశామని లీగల్, ల్యాండ్స్‌తో పాటు ఇతర విభాగాల్లోనూ మర్పాఉలు చేస్తామని భ్రమరాంబ స్పష్టం చేశారు. మూడునెలలు పూర్తయిన వారిని మాత్రమే మార్చామని, మూడు నెలలు నిండని వారిని బదిలీ చేశామన్న వార్తలు అవాస్తమన్నారామె. ఇలాంటి బదిలీలు ఆలయాల్లో సహజమేనంటూ ఈవో కొట్టిపారేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..