RK: ఆక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్‌కె మరణంతో AOBలో మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ.?
ఆంధ్రా ఒరిస్సా బోర్డర్. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట. ఇప్పుడు వారి ఉనికే ప్రశ్నార్థకమైన ప్రాంతం. ఇప్పుడు AOBలో ఉద్యమ ఊపిరి ఆగిపోయింది. ఆక్కిరాజు హరగోపాల్ అలియాస్

Akkiraju Haragopal Alias RK: A.O.B. ఆంధ్రా ఒరిస్సా బోర్డర్. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట. ఇప్పుడు వారి ఉనికే ప్రశ్నార్థకమైన ప్రాంతం. ఇప్పుడు AOBలో ఉద్యమ ఊపిరి ఆగిపోయింది. ఆక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణంతో AOBలో మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్కే ఉన్నప్పుడు ఏవోబిలో అడుగు పెట్టాలంటేనే పోలీస్ బలగాలు ఆలోచించేవి. పీపుల్స్ వార్‌గా ఉన్నప్పుడే 1998 నుంచి ఏవోబిలో పోలీస్ స్టేషన్లపై, ఔట్ పోస్టులపై దాడులు జరిగాయి. ఈస్ట్ డివిజన్‌లో చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అప్పారావు బాధ్యతలు చేపట్టినప్పుడు పెద్ద పెద్ద దాడులు జరిగాయి. 1998లో మొదటిసారి జాన్ బాయ్, మల్లిగూడ పోలీస్ ఔట్ పోస్టులపై దాడి చేసి ఆయుధాలను తీసుకెళ్లారు. ఆ తర్వాత కలిమెల, మోటూ పోలీస్ స్టేషన్లపై దాడి, కోరాపుట్, మల్కన్‌గిరి జైలుపై దాడి, ఆర్.ఉదయగిరి, నెల్కో కంపెనీపై దాడులు చేశారు. దీంతో ఏవోబిలో ఔట్ పోస్టులతో పాటు మరికొన్ని పోలీస్ స్టేషన్లను ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అప్పుడే ఏవోబిలో ఉమ్మడి ఏపీ పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలను దించారు. మావోయిస్టులను ఎరివేయడానికి గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేసినప్పుడే బలిమెల రిజర్వాయర్ దగ్గర మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. 2008 జూన్ 29న జరిగిన ఘటనలో 36 మంది పోలీసులు చనిపోయారు. ఆ తర్వాత మావోయిస్టులకు ఎదురు లేకుండా పోయింది. ఏవోబిలో గ్రేహౌండ్స్ బలగాలు ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా ప్రయత్నించాయి. సుదీర్ఘ కాలం తర్వాత 24 అక్టోబర్ 2017న జరిగిన ఘటనలో 32 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒడిశాలోని రామగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ప్లీనరీపై ఒడిశా పోలీసులు, ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేసి మెరుపుదాడి నిర్వహించాయి.
ఆ తర్వాత ఏవోబిలో పోలీస్ ఇన్‌ఫార్మర్ వ్యవస్ధను పటిష్టం చేశారు పోలీసులు. ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతిచెందడం, లొంగిపోవడం వంటివి జరిగాయి. అదే సమయంలో మావోయిస్టు అగ్రనాయకులు ద్వితీయ స్థాయి నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవల ఏవోబి SZC మిలటరీ కమిషన్ చీఫ్ దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు పోలీసుల ఆపరేషన్లతో ఏవోబీలో పట్టు కోల్పోయారు మావోయిస్టులు. తాజాగా ఆర్కే మృతి చెందడంతో ఏవోబిలో చలపతి, ఉదయ్ ఇద్దరు అగ్రనాయకులే మిగిలారు. దీంతో ఏవోబిలో మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగిసిట్లేనని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
Read also: దసరా అంబరాలకు మారుపేరు మైసూర్ ప్యాలెస్. మహారాజు వడియార్ జంబూ సవారీ కోసం కలర్‌ఫుల్‌గా ముస్తాబు