AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Schools: ఏపీ ప్రైవేటు స్కూల్స్‌లో పేదలకు 25 శాతం సీట్లు కేటాయింపు.. హైకోర్ట్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో..

AP Schools: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల కేటాయించే సీట్ల విషయమై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల్లో పేదల కోసం 25 శాతం కేటాయిస్తామని..

AP Schools: ఏపీ ప్రైవేటు స్కూల్స్‌లో పేదలకు 25 శాతం సీట్లు కేటాయింపు.. హైకోర్ట్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో..
Narender Vaitla
|

Updated on: Jan 03, 2022 | 2:21 PM

Share

AP Schools: ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల కేటాయించే సీట్ల విషయమై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల్లో పేదల కోసం 25 శాతం కేటాయిస్తామని తెలిపింది. ఈ విషయమై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు సీట్లను కేటాయించాలని తాండవ యోగేష్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద వర్గానికి చెందిన విద్యార్థులకు సీట్లను కేటాయించాలని న్యాయ స్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు నిబంధనలను అమల్లోకి తీసుకురాలేమని, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి సీట్ల కేటాయింపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థల్లో పేద వర్గానికి చెందిన విద్యార్థులకు కూడా అవకాశం లభిస్తుందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ఫీజులపై గతంలో విద్యాశాఖ విడుదల చేసిన జీఓలను ఏపీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏపీలోని అన్ని ప్రైవేట్‌ స్కూళ్లు, జూ.కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. కాలేజీలు, స్కూల్స్‌ నుంచి ప్రతిపాదనలు తీసుకొని ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

Also Read: Statue Demolished: ఏపీలో విగ్రహాల విధ్వంసం రచ్చ.. లైవ్ వీడియో

Money Deposits: అకౌంట్‌లో పడ్డ 170 మిలియన్ డాలర్ల డబ్బు.. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన బ్యాంక్..!

తెలంగాణలో 15-18 ఏళ్ల యువతీ యవకులకు వ్యాక్సినేషన్ ప్రారంభం.. కాలేజీ యాజమాన్యాలకు మంత్రి హరీష్ వినతి

Follow Us
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
అదిరిపోయే ప్లగ్‌-ఇన్ హైబ్రిడ్ SUV వచ్చేస్తోంది
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
APPSC నుంచి 97 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ఒక్క రాత్రిలో కంటిచూపును అమాంతం పెంచే అద్భుతమైన పాతకాలపు చిట్కా
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
ప్రెజర్ కుక్కర్‌లో అన్నం మరీ మెత్తగా అవుతోందా..? ఇలా చేయండి..!
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 11 దినఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
సతీదేవి నుంచి శైలపుత్రిగా పార్వతి.. నవదుర్గల తొలి రూపం వెనుక..
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు పిల్లలు, గర్భిణీ సహా 9 మంది మృతి!
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?
క్రోనీ కేపిటలిజం కోసం మస్క్‌ మామ దొంగాట?
నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్
నవరాత్రి ఉపవాసాల్లో బాడీకి తక్షణ శక్తినిచ్చే స్పెషల్ డ్రింక్