Money Deposits: అకౌంట్‌లో పడ్డ 170 మిలియన్ డాలర్ల డబ్బు.. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన బ్యాంక్..!
Money Deposits: యూకేలో ఆసక్తికర ఘటన జరిగింది. బ్యాంక్ సర్వర్లలో ఏర్పడిన సమస్య కారణంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 ఫౌండ్ల(170 డాలర్లు) సొమ్ము పలువురి
Money Deposits: యూకేలో ఆసక్తికర ఘటన జరిగింది. బ్యాంక్ సర్వర్లలో ఏర్పడిన సమస్య కారణంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 మిలియన్ పౌండ్ల(170 మిలియన్ డాలర్లు) సొమ్ము పలువురి ఖాతాల్లో జమ అయ్యింది. ఈ ఘటన క్రిస్మస్ రోజున జరుగగా.. తాజాగా డబ్బులు తిరిగి చెల్లించాలంటూ సదరు అకౌంట్ హోల్డర్లకు నోటీసులు వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూకే కి చెందిన ‘శాంటాండర్’ బ్యాంకు సర్వర్లలో ఏర్పడిన లోపం వల్ల దాదాపు 2 వేల మంది కార్పొరేట్, వాణిజ్య ఖాతాదారుల అకౌంట్లకు సంబంధించి 75,000 చెల్లింపులు రెండు సార్లు జరిగాయి. అయితే, అవి వారి అకౌంట్ నుంచి కాకుండా.. నేరుగా బ్యాంకుకు చెందిన డబ్బు కట్ అయ్యింది. మరికొందరికి కూడా తక్కువ మొత్తంలో సొమ్ము బదిలీ అయ్యింది. ఇదంతా షెడ్యూలింగ్‌లో ఏర్పడిన లోపం కారణంగా నగదు బదిలీ అయినట్లు బ్యాంకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే, జరిగిన పొరపాటును త్వరగా గుర్తించి సరిదిద్దామని బ్యాంకు అధికారులు తెలిపారు. క్రిస్మస్ రోజున పొరపాటున బదిలీ అయిన 130 ఫౌండ్ల సొమ్మును తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకున్నామని బ్యాంకు అధికారులు చెప్పారు. అయితే, ఈ డూప్లికేట్ లావాదేవీలను రాబట్టడం అక్కడ తలకు మించిన భారంగా చెబుతున్నారు నిపుణులు. ఖాతాదారులు ఒక వేళ ఆ సొమ్మును ఖర్చు చేసినట్లయితే.. ఓవర్ డ్రాఫ్ట్‌లోకి వెళ్తుందని బ్యాంకు పేర్కొంది. ఎవరి ఖాతాలో అయితే నిధులు జమ అయ్యాయో వారి నుంచి నేరుగా ఆ నిధులను రికవరీ చేయడానికి బ్యాంకులకు ఒక ప్రొసీజర్ ఉంటుందని, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు తెలిపారు. శాంటాండర్ బ్రిటిష్ హై స్ట్రీట్ వింగ్ 14 మిలియన్ ఖాతాదారులను కలిగి ఉంది. 2021 మొదటి మూడు త్రైమాసికాలలో 1 బిలియన్ షౌండ్ల కంటే ఎక్కువ నికర లాభాన్ని ఆర్జించింది.
Also read:
Coronavirus: మెడికల్ కళాశాలలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు
Ranji Trophy 2022: రంజీలో కరోనా కలకలం.. 7గురికి పాజిటివ్.. జనవరి 13 నుంచి టోర్నీ ప్రారంభం..!