GST on Footwear: చీప్ లిక్కర్ కాదు చెప్పుల ధరలు తగ్గించండి.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీపీఐ నారాయణ..

GST on Footwear: చెప్పుల ధరలపై పెంపును తప్పు పడుతూ.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నాడు తిరుపతిలో పర్యటించిన ఆయన..

GST on Footwear: చీప్ లిక్కర్ కాదు చెప్పుల ధరలు తగ్గించండి.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీపీఐ నారాయణ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 03, 2022 | 1:55 PM

GST on Footwear: చెప్పుల ధరలపై పెంపును తప్పు పడుతూ.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నాడు తిరుపతిలో పర్యటించిన ఆయన.. చెప్పులపై జీఎస్టీ విధించడాన్ని ఖండించారు. బూట్ పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పేదలు చెప్పులు కూడా వేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచిందన్నారు. చెప్పులపై విధించిన జీఎస్టీని వెనక్కి తీసుకోకపోతే చెప్పులతోనే నిరసన వ్యక్తం చేయక తప్పదని హెచ్చరించారు నారాయణ. సారాయి ని తక్కువ ధరలకు ఇస్తామంటున్న బీజేపీ.. చెప్పులపై మాత్రం తగ్గించరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీయడానికి కేంద్రమే కారణం అని ఆరోపించారు నారాయణ. కేంద్రం వల్లే రాష్ట్రానికి నష్టం వచ్చిందన్నారు. ఢిల్లీకి వెళుతున్న సీఎం జగన్ రాష్ట్రానికి లాభాలతో రావాల్సిన ఉందన్నారు. తూతూ మంత్రంగా చర్చించి రాష్ట్రానికి రాకూడదని సీఎం కు సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సీఎం లను ఢిల్లీకి పిలిపించుకుని కేంద్రం భయపెడుతోందని సీపీఐ నారాయణ ఆరోపించారు. ఇదే సమయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై తీవ్రంగా స్పందించారు నారాయణ. వైఫల్యం చెందిన ప్రభుత్వాలు విగ్రహాలపై దాడులను ఉసిగొల్పుతున్నాయని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. సినిమా పరిశ్రమలో ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకుని కాకుండా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నారాయణ సూచించారు.

Also read:

NTR Statue in Durgi: ఎన్టీఆర్ విగ్రహం ధ్వసం చేసేందుకు పట్టపగలే ఓ వ్యక్తి యత్నం.. దుండగుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్

Coronavirus: మెడికల్‌ కళాశాలలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు

Ranji Trophy 2022: రంజీలో కరోనా కలకలం.. 7గురికి పాజిటివ్.. జనవరి 13 నుంచి టోర్నీ ప్రారంభం..!