AP Weather Alert: ఏపీ వాసులకు వాతావరణ సూచన… రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఈరోజు, రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 28వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
AP Weather Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో గల ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులకు పలు వాతావరణ సూచనలు చేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈరోజు, రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 28వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈరోజు, రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 28వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది
రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 28వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..