AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenali: 2024 పొలిటికల్‌ ఫైట్‌కు ఆంధ్రా ప్యారిస్‌ రెడీ.. త్రిముఖ పోటీలో విజయం నీదా.. నాదా..

త్రిముఖ పోరుపై అప్పుడే రాజకీయ చర్చలు జోరందుకున్నాయా.. ఈ సారైనా గెలిచి తీరాలని గ్లాస్‌ పార్టీ నెంబర్‌ టూ అప్పుడే అన్నీ సెట్ చేసుకుంటున్నారా.. మాటల తూటాలు పేల్చుతున్నారా.. నాది తెనాలే..మీది తెనాలేనా అని సారు ఎలెక్షన్‌ జోష్‌ మీదున్నారు ఆయనెవరో చూద్దామా..

Tenali: 2024 పొలిటికల్‌ ఫైట్‌కు ఆంధ్రా ప్యారిస్‌ రెడీ.. త్రిముఖ పోటీలో విజయం నీదా.. నాదా..
Tenali
Sanjay Kasula
|

Updated on: Jul 15, 2022 | 7:54 PM

Share

2024లో జరగబోయే పొలిటికల్‌ ఫైట్‌కు ఆంధ్రా ప్యారిస్‌ అప్పుడే రెడీ అయ్యిందా.. ట్రై యాంగిల్‌ ఫైట్‌ కోసం తెనాలి హీటెక్కుతోందా.. త్రిముఖ పోరుపై అప్పుడే రాజకీయ చర్చలు జోరందుకున్నాయా.. ఈ సారైనా గెలిచి తీరాలని గ్లాస్‌ పార్టీ నెంబర్‌ టూ అప్పుడే అన్నీ సెట్ చేసుకుంటున్నారా.. మాటల తూటాలు పేల్చుతున్నారా.. నాది తెనాలే.. గుంటూరు జిల్లాలో మోస్ట్ పాపులర్‌ సెగ్మెంట్ తెనాలి.. బాపట్ల జిల్లా కావడంతో.. తెనాలి గుంటూరు జిల్లాలో చేరింది. ఎంతోమంది ఉద్ధండులు పోటీ చేసిన నియోజకవర్గం తెనాలి. నాదెండ్ల భాస్కర్‌రావు, కొణిజేటి రోశయ్య, అన్నాబత్తుని సత్యనారాయణ, ఆలపాటి వెంకట్రామయ్య వంటి మహామహులు తెనాలి వీరులే.. ఇక్కడి నుంచే ప్రస్తుతం జనసేనలో నెంబర్‌టూ గా చెప్పుకునే నాదెండ్ల మనోహర్‌ ఒకప్పుడు కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజనతో 2014లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత జనసేనలో చేరిన నాదెండ్ల 2019లో.. గ్లాస్‌పార్టీ నుంచి నిలబడినా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసిన అన్నాబత్తుని శివకుమార్‌ విజయం సాధించారు. టిడిపి నుంచి ఆలపాటి రాజా కూడా బరిలో దిగారు. దీంతో..త్రిముఖ పోటీ తప్పలేదు.

రాబోయే ఎన్నికల్లో నాదెండ్ల మరోచోట పోటీ చేస్తారని మొదట్లో వినిపించినా..ఇప్పుడు మాత్రం నాది తెనాలీ..మీరే వేరే చూసుకోండని క్లారిటీ ఇచ్చారు. సో..మళ్లీ ఆ ముగ్గురే బరిలో దిగబోతున్నారు. అంటే మళ్లీ ట్రై యాంగిల్‌ ఫైట్‌ తప్పదు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి స్పీకర్‌గా పని చేసిన నాదెండ్ల.. తన అడ్డాలో అభివృద్ధి పనులు చేసి మైలేజ్‌ తెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత గెలవకపోయినా.. ప్రస్తుతం మాత్రం జనసేనలో నాదెండ్లే నెంబర్‌ టూ అని జోరుగా వినిపిస్తోంది. సో తెనాలి నుంచే పోటీ చేయాలని..అప్పుడే కార్యకర్తలతో టచ్‌లోకి వెళ్లారట.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ కూడా నీది తెనాలే నాది తెనాలే అంటున్నారు. నియోజకవర్గంలో పట్టు సాధించారనే టాక్‌ వినిపిస్తోంది. పార్టీలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవడంతో..ఈ సారి కూడా వైసిపి నుంచి ఆయనే తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. టిడిపి నుంచి ఆలపాటి రాజానే ఉంటారని లోకల్‌ కేడర్‌ ఒపీనియన్.

అయితే నియోజకవర్గంలో నాదెంట్లకు సౌమ్యుడనే పేరుంది. పలుసార్లు అన్నాబత్తుని..ఆలపాటి అనుచరులు గొడవలకు దిగడం.. తెనాలిలో రచ్చరేపింది. రాళ్లు రువ్వుకోవడం, ఫ్లెక్సీలు చించడం.. పరస్పర ఘాటైన విమర్శలు చేసుకోవడం ఓటర్లకు రుచించడం లేదు. ఎందుకంటే..ఇక్కడ ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ జరగలేదు. సో..ఎటు చూసినా ఈసారి నాదెండ్లకే జనం జై కొడతారని జనసైనికుల టాక్‌.. ఏదేమైనా ఈ సారి మాత్రం ఆంధ్ర ప్యారిస్‌లో త్రిశూల వ్యూహం ఎవరు పాటిస్తారో..వాళ్లదే ఈ త్రిముఖ పోటీలో గెలుపన్నది కాదనలేని సత్యం.

ఏపీ వార్తల కోసం..