Telugu Language Day: నేడు తెలుగు భాషా దినోత్సవం… సైకత శిల్పంతో అదరగొడుతున్న ఇద్దరు బాలికలు..

దేశభాషలన్నిటిలోనూ "తెలుగు" భాష చాలా గొప్ప విలువైనది. ఎన్ని భాషలైన నేర్చుకో- అమ్మ భాషను అక్కున చేర్చుకో.. అన్న నినాదంతో సైకత శిల్పాలతో అదరగొడుతున్నారు ఇద్దరు బాలికలు. నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలుగు గొప్పదనాన్ని వివరిస్తూ సైకత శిల్పం రూపొందించారు ఇద్దరు యువతులు. సైకత శిల్పంతో అదరగొడుతున్న అనపర్తికి చెందిన ఇద్దరు బాలికలు. ఆగష్టు 29 ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సైకత శిల్పం రూపొందించారు ఇద్దరు చిన్నారులు.

Telugu Language Day: నేడు తెలుగు భాషా దినోత్సవం... సైకత శిల్పంతో అదరగొడుతున్న ఇద్దరు బాలికలు..
Telugu Language Day
Follow us
Pvv Satyanarayana

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 29, 2023 | 1:30 PM

దేశభాషలన్నిటిలోనూ “తెలుగు” భాష చాలా గొప్ప విలువైనది. ఎన్ని భాషలైన నేర్చుకో- అమ్మ భాషను అక్కున చేర్చుకో.. అన్న నినాదంతో సైకత శిల్పాలతో అదరగొడుతున్నారు ఇద్దరు బాలికలు. నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలుగు గొప్పదనాన్ని వివరిస్తూ సైకత శిల్పం రూపొందించారు ఇద్దరు యువతులు. సైకత శిల్పంతో అదరగొడుతున్న అనపర్తికి చెందిన ఇద్దరు బాలికలు. ఆగష్టు 29 ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సైకత శిల్పం రూపొందించారు ఇద్దరు చిన్నారులు.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకతశిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆ కట్టుకుంటుంది. తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు రూపాన్ని, మరోవైపు తెలుగు భాష కోసం ‘అ’ అనే అక్షరం ఏడుస్తున్నట్టుగా ఇసుకతో తీర్చిదిద్దిన సైకత శిల్పం నేటి కాలంలో తెలుగు భాష ఎదుర్కొంటున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిన్నారులు రూపొందించిన సైకత శిల్పం చూసేందుకు అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలి వచ్చారు. సోహిత, ధన్యత లకు అభినందనలు తెలిపారు. సైకత శిల్పం చెక్కడమే వీరి పని కాదు.. సైకత శిల్పంతో పాటు వాటిని వివరిస్తూ కవితల రూపంలో పాటలు పాడడం మరొక విశిష్టత. కమ్మనైన మాతృభాష గురించి పాటల రూపంలో వివరించారు ఈ ఇద్దరు చిన్నారులు.

ఇద్దరు బాలికలు వేసిన సైకత శిల్పం ఇదే..