AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజలకు సన్ అలర్ట్.. 40 డిగ్రీలు దాటేసింది.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు..! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

ప్రజలకు సన్ అలర్ట్.. 40 డిగ్రీలు దాటేసింది.. ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
Andhra Telangana Weather
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2025 | 10:15 AM

Share

భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు..! బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కులు చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రమైనా భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది. ఇప్పుడే ఈ రేంజ్ లో ఎండలు ముదిరితే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మే నెల రాకముందే.. తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది.. ఆదివారం కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.. కోస్తాలోని 45 మండలాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని పేర్కొంది.. అంతేకాకుండా మరో 185 మండలాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలతోపాటు.. తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎండల ప్రభావం ఉంటుందని పేర్కొంది.. నిన్న చాలాచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.. సోమవారం కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది..

నిన్నటి ఉష్ణోగ్రతలు ఓసారి చూస్తే.. ప్రధానంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ప్రకాశం జిల్లా దరిమడుగు, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.7 డిగ్రీలు ఉంటే.. కడప జిల్లా మద్దూరు, ఖాజీపేటలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐతే.. రియల్‌ ఫీల్‌ మాత్రం ఇంకో 2 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

తెలంగాణలో..

తెలంగాణలో కూడా రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. ఆదివారం సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అయ్యే చాన్స్‌ ఉందని తెలిపింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్.. 15 వారాలకు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఈ చిట్కాలు పాటించారంటే.. పెద్ద దుప్పటి ఉతకడం చాలా ఈజీ..
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే