Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayasai Reddy: కోటలో రాజు బాగుండాలంటే జనంలోకి రావాలి: విజయసాయిరెడ్డి సెన్సెషనల్ ట్వీట్..

గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్న కేజీఎఫ్‌ సినిమా డైలాగ్‌ని రిపీట్‌ చేస్తున్నారు వీఎస్‌ఆర్‌ అనుచరులు.. వైసీపీపై విజయసాయి వార్‌... షురూ అయిందంటున్నారు. అందుకు తగ్గట్లుగానే జగన్‌ చూట్టూ ఓ కోటరి ఉందని మొన్న సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసిన విజయసాయిరెడ్డి.. తాజాగా జగన్‌పై మరో బుల్లెట్‌ వదలారు.

Vijayasai Reddy: కోటలో రాజు బాగుండాలంటే జనంలోకి రావాలి: విజయసాయిరెడ్డి సెన్సెషనల్ ట్వీట్..
Vijayasai Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 16, 2025 | 9:03 AM

గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్న కేజీఎఫ్‌ సినిమా డైలాగ్‌ని రిపీట్‌ చేస్తున్నారు వీఎస్‌ఆర్‌ అనుచరులు.. వైసీపీపై విజయసాయి వార్‌… షురూ అయిందంటున్నారు. అందుకు తగ్గట్లుగానే జగన్‌ చూట్టూ ఓ కోటరి ఉందని మొన్న సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసిన విజయసాయిరెడ్డి.. తాజాగా జగన్‌పై మరో బుల్లెట్‌ వదలారు. రాజులు, రాజ్యాలు, కోటరి, కోటలు అంటూ పెద్ద స్టోరీనే చెప్పుకొచ్చారు. అసలు విజయసాయిరెడ్డి టార్గెట్‌ ఏంటి..? వీఎస్‌ఆర్‌కి కౌంటర్‌గా వైసీపీ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఎలా ఉండబోతోంది..?

మొత్తం వాళ్లే చేశారు.. అవమానించారు.. తొక్కేశారు.. టోటల్‌గా మనసు విరగ్గొట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి… లేటెస్ట్‌గా ఇంకాస్త క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తాను మరిన్ని బాణాలు విసరబోతున్నారంటూ హింట్‌ కూడా వచ్చేసింది. ఈసారి రాజుల కథతో వచ్చారు విజయసాయిరెడ్డి. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదంటూ ఎక్స్‌లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. ఇక తెలివైన రాజైతే మారు వేషంలో ప్రజల్లోకి వెళ్లి, ఏం జరుగుతోందో తెలుసుకునేవాడు. పొగిడే వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ జగన్‌పై పరోక్షంగా మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు విజయసాయిరెడ్డి.

మొన్న కాకినాడ సెజ్‌ కేసులో విజయవాడ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి… ఆ తర్వాత మాట్లాడిన మాటలు అందరిని షాక్‌కు గురిచేశాయి. కోటరి కామెంట్స్‌… వైసీపీలో కలకలం రేపాయి.

ఇక విజయసాయిరెడ్డి తీరుపై వైసీపీ నేతలు ఓరేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. విజయసాయికి సడెన్‌గా ఎవరి మీదనో ప్రేమ పుట్టిందంటున్నారు. కోటరి అని మాట్లాడే ఆయనే పెద్ద కోవర్డు అని రివర్స్‌ ఎటాక్‌ చేస్తున్నారు. మొత్తంగా.. వీఎస్‌ఆర్ కోటరీ కహానీ ఇంకెంత దూరం వెళ్తుందో..! ఏ స్థాయిలో అగ్గిరాజేస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..