CM Jagan: సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. రోడ్డు మార్గాన బయలుదేరిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అనంతరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం హెలికాప్టర్‌లో అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే హెలికార్టర్‌ ప్రయాణాన్ని రద్దు చేశారు. నార్పల నుంచి పుట్టపర్తికి ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది....

CM Jagan: సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. రోడ్డు మార్గాన బయలుదేరిన ముఖ్యమంత్రి
CM Jagan (File Photo)
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 26, 2023 | 3:44 PM

ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అనంతరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం హెలికాప్టర్‌లో అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే హెలికార్టర్‌ ప్రయాణాన్ని రద్దు చేశారు. నార్పల నుంచి పుట్టపర్తికి ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో వెంటనే షెడ్యూల్‌లో మార్పులు చేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం పుట్టపర్తికి బయలు దేరారు. హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవ్వకముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ప్రయాణించాల్సి విమానంలో సాంకేతిక లోపం గుర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఢిల్లీ బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి ప్రయణించాల్సిన ప్రత్యేక విమానంలో అధికారులు సాంకేతిక లోపాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. అప్పుడు మరో విమానంలో సీఎం ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సాంకేతిక లోపం తలెత్తడం వివాదాస్పదంగా మారింది.

ఇదిలా ఉంటే అనంతపురం పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ముఖ్యమంత్రి అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నార్పల మండలానికి వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం తిరిగి పుట్టపర్తి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం గుర్తించడంతో రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి పుట్టపర్తి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..