AP Inter Results Highlights: విడుదలైన ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈసారి కూడా బాలికలదే పైచేయి. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..
AP Inter 1st, 2nd Year Results 2023 Live Updates: విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు.. రిజల్ట్స్ ను ఇక్కడ సింపుల్ గా చెక్ చేసుకోండి..
AP Inter 1st, 2nd Year Results Highlights: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. మంత్రి బొత్సా సత్యనారయణ విజయవాడలో బుధవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. మొత్తం మీద ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 75 శాతంతో కృష్ణజిల్లా మొదటి స్థానంలో నిలవగా వెస్ట్ గోదావరి (70 శాతం), గుంటూరు (68 శాతం)తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక సెకండ్ ఇయర్ విషయానికొస్తే 83 శాతంతో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. గుంటూరు (78 శాతం), వెస్ట్ గోదావరి (77 శాతం) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 46 శాతంతో కడప చివరి స్థానంలో నిలవగా, సెకండ్ ఇయర్‌లో 57 శాతంతో విజయనగరం చివరి స్థానంలో నిలిచింది.
LIVE NEWS & UPDATES
-
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..
-
రీకౌంటింగ్ తేదీలు ఎప్పుడంటే..
ఫలితాలపై విద్యార్థులకు ఎవరికైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ విరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు రెండు సెషన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.
-
-
జిల్లాల వారీగా ఫలితాలు..
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 75 శాతంతో కృష్ణజిల్లా మొదటి స్థానంలో నిలవగా వెస్ట్ గోదావరి (70 శాతం), గుంటూరు (68 శాతం)తో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక సెకండ్ ఇయర్ విషయానికొస్తే 83 శాతంతో కృష్ణ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. గుంటూరు (78 శాతం), వెస్ట్ గోదావరి (77 శాతం) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
-
ఎంత మంది పాస్ అయ్యారంటే..
4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. మొత్తం మీద ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి.
-
ఇంటర్ ఫలితాలు విడుదల..
ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ముందు అనుకున్న సమయం కంటే సుమారు గంటన్నర ఆలస్యంగా ఫలితాలు విడుదలయ్యాయి. వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.
-
-
మరింత ఆలస్యం కానున్న ఫలితాలు..
ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడనుంది. 6 గంటలకు విడుదల చేయాల్సి ఉండగా మరో 15 నిమిషాలు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ చేరుకోవడానికి మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో ఫలితాలు ఆలస్యం కానున్నాయి.
-
ఇంటర్ ఫలితాలకు మొదలైన కౌంట్ డౌన్..
ఏపీ ఇంటర్ ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికాసేపట్లో ఫలితాలను విడుదల చేయనున్నారు. నిజానికి 5 గంటలకు ఫలితాలు విడుదలకావాల్సి ఉండగా, గంట ఆలస్యంగా రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. బొత్స సత్యనారాయణ ఆలస్యంగా విజయవాడకు చేరుకున్న కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది.
-
గత కొన్నేళ్లుగా సెకండ్ ఇయర్ ఫలితాలు ఇలా ఉన్నాయి..
* 2015 – 55.87 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు * 2016లో 60.59 శాతం మంది * 2017లో 60.01 శాతం మంది * 2018లో 57 శాతం మంది * 2019లో 55 శాతం మంది * 2020లో 59 శాతం మంది * 2022లో 61 శాతం మంది
-
గంట ఆలస్యం కానున్న ఫలితాలు..
ఏపీ ఇంటర్ ఫలితాలు గంట ఆలస్యం కానున్నాయి. నిజానికి సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా గంట ఆలస్యం కానుంది. 6 గంటలకు ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అనంతపురం పర్యటనలో ఉన్న బొత్స సీఎం హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విజయవాడకు ఆలస్యంగా చేరుకోనున్నారు. ఈ కారణంగానే ఫలితాల విడుదల ఆలస్యం కానుంది.
-
ఇంటర్ మార్క్స్ మెమోను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
* మొదట అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ఓపెన్ చేయాలి.
* తర్వాత హోమ్ పేజీలో కనిపించే ఏపీ ఇంటర్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయాలి
* హాల్ టికెట్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి
* వెంటనే రిజల్ట్స్ ప్రత్యక్షమవుతాయి
-
ఎంత మంది పరీక్ష రాశారంటే..
ఈ ఏడాది ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి 10,03,990 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వారిలో 4,84,197 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు కాగా, 5,19,793 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,489 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
Published On - Apr 26,2023 4:01 PM