AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డ సీఎం జగన్.. ఏమన్నారంటే

జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారని.. ఆయన మాటలు వింటే పంచతంత్రం కథలు గుర్తుకొచ్చాయని అన్నారు.

CM Jagan: చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డ సీఎం జగన్.. ఏమన్నారంటే
Andhra CM Jagan Reddy
Aravind B
|

Updated on: Apr 26, 2023 | 1:42 PM

Share

జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారని.. ఆయన మాటలు వింటే పంచతంత్రం కథలు గుర్తుకొచ్చాయని అన్నారు. ఈ పంచతంత్రం కథల్లో చంద్రబాబు నాయుడిని పులితో పోల్చారు. నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని.. వేటాడే శక్తి లేక నాలుగు నక్కల్ని తోడేసుకుందని అన్నారు. చంద్రబాబు అనే పులి మోసం గురించి తెలిసిన వారు ఆయన రారని.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది కదా అని ఎవరైన నమ్మి వెళ్తే మడుగులో పడి బురదలో ఇరుక్కుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా బురదలో పడ్డ వారిని పులి చంపుకు తింటుందని.. బాబు నైజం కూడా అలాంటిదేనని విమర్శించారు.

అబద్దాలు చెప్పేవారిని, వెన్నుపోటు పొడిచేవారిని నమ్మకూడదని ఈ కథ చెబుతుందని.. ఇది వింటే చంద్రబాబే గుర్తుకు వస్తారని తెలిపారు. ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకు బాబు పాత డైలాగులు కొడుతున్నారని.. అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అయినప్పుడు చంద్రబాబు ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దొచుకో, పంచుకో, తినుకో అన్నదే బాబు విధానమన్నారు. రాబోయే రోజుల్లో అబద్దాలు, మోసాలు పెరుగుతాయని.. మీ ఇంట్లో మంచి జరిగితే జగన్ సైనికులుగా మారండంటూ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..