Andhra Politics: నలుగురు కాదు నలభై మంది..! అంత సీన్ ఉందా..? కాకపుట్టిస్తున్న ఆంధ్రా రాజకీయం..

ఆంధ్రప్రదేశ్‌లో జంపింగ్‌ రాజకీయం కాకరేపుతోంది. మేం ఊ.. అంటే 40మంది ఉరుక్కుంటూ వచ్చేయడానికి రెడీగా ఉన్నారంటూ టీడీపీ మొదలుపెట్టిన మైండ్‌గేమ్‌ మంటలు పుట్టిస్తోంది. 40మంది కాదు.. 60మంది అసంతృప్తిగా ఉన్నారంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు వైసీపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యేలు

Andhra Politics: నలుగురు కాదు నలభై మంది..! అంత సీన్ ఉందా..? కాకపుట్టిస్తున్న ఆంధ్రా రాజకీయం..
Ap Politics
Follow us

|

Updated on: Mar 30, 2023 | 7:37 AM

ఆంధ్రప్రదేశ్‌లో జంపింగ్‌ రాజకీయం కాకరేపుతోంది. మేం ఊ.. అంటే 40మంది ఉరుక్కుంటూ వచ్చేయడానికి రెడీగా ఉన్నారంటూ టీడీపీ మొదలుపెట్టిన మైండ్‌గేమ్‌ మంటలు పుట్టిస్తోంది. 40మంది కాదు.. 60మంది అసంతృప్తిగా ఉన్నారంటూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు వైసీపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యేలు. అవునా, అయితే వాళ్ల పేర్లు చెప్పండంటూ రివర్స్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసింది వైసీపీ.. ఈ రాజకీయం కాస్త ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఏపీలో పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరిగిపోయింది. టీడీపీ అనూహ్యంగా నాలుగు ఎమ్మెల్సీలను గెలుచుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి ఓటేయడం, వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో మొదలైన ప్రకంపనలు స్టేట్‌ పాలిటిక్స్‌ని షేక్‌ చేస్తున్నాయ్‌.

ఆ నలుగురే కాదు మొత్తం నలభైమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ టీడీపీ లీడర్స్‌ చేస్తోన్న కామెంట్స్‌… అధికార పార్టీలో కలవరం రేపుతున్నాయ్‌. నిజంగా టచ్‌లో ఉన్నారోలేదో తెలియదుకానీ తెలుగుదేశం ఆడుతోన్న మైండ్‌గేమ్‌ మాత్రం ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. నలుగురు కాదు నలభై మంది రెడీగా ఉన్నారు. మేం ఊ అంటే చాలు-వాళ్లంతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌కి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా. 175 సీట్లల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధుల్లేరు గాని, మీతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా?. నీకు దమ్ముంటే వాళ్ల పేర్లు చెప్పు చూద్దామంటూ సవాల్‌ విసిరారు రోజా.

టీడీపీలో చేరతామంటూ నలభై యాభైమంది వైసీపీ ఎమ్మెల్యేలు రోజూ ఫోన్లు చేస్తున్నారు. ఆ ఫోన్లతో తమ చెవులు గుయ్‌గుయ్‌మంటున్నాయ్‌ అంటున్నారు అచ్చెన్నాయుడు. కానీ, మేం ఎవర్నిబడితే వాళ్లను పార్టీలో చేర్చుకోం, మంచివాళ్లనే తీసుకుంటామన్నది ఆయన మాట. ఇది టీడీపీ ఆడుతోన్న మైండ్‌గేమ్‌ కాదో పక్కనబెడితే, ఇటీవల వైసీపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యేల నుంచీ ఇదే మాట రీసౌండ్‌ వస్తోంది. దాదాపు యాభై అరవై మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే, వాళ్లంతా సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. మరి, టీడీపీ చెబుతున్నట్టుగా నిజంగానే 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారా? లేదా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..