Delhi: కేంద్ర హోమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. ఆ రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ఒత్తిడి..!

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. అక్కడ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన ఆయన.. సమస్యల చిట్టా విప్పారు. విభజన జరిగి తొమ్మిదేళ్లయ్యిందని, సమస్యలను ఇంకెప్పుడు పరిష్కరిస్తారంటూ అడిగారు. ప్రధానంగా 13 అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్.

Delhi: కేంద్ర హోమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ.. ఆ రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ఒత్తిడి..!
Jagan And Amit Shah
Follow us

|

Updated on: Mar 30, 2023 | 6:01 AM

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. అక్కడ బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన ఆయన.. సమస్యల చిట్టా విప్పారు. విభజన జరిగి తొమ్మిదేళ్లయ్యిందని, సమస్యలను ఇంకెప్పుడు పరిష్కరిస్తారంటూ అడిగారు. ప్రధానంగా 13 అంశాలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. అందులో రెండింటిని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ రెండింటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ అమిత్‌షాకి విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఆ రెండూ ఏంటి?. వాటిపై ఎందుకంత జగన్‌ ఒత్తిడి చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

సీఎం జగన్ ప్రధానంశాలుగా పేర్కొన్నవి పోలవరం, విభజన సమస్యలు. ఈ రెండే మెయిన్‌ అజెండాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చలు జరిపారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. ప్రధానంగా 13 అంశాలను షా దృష్టికి తీసుకెళ్లినా.. పోలవరం, విభజన ఇష్యూస్‌ను నొక్కిచెప్పారు. పోలవరం నిధులను వెంటనే ఇవ్వాలని కోరారు. ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న వ్యయాన్ని ఎప్పటికప్పుడు రిలీజ్‌ చేయాలని విజ్ఞప్తిచేశారు. అలాగే, పోలవరం రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌కి ఆమోదం తెలపాలని, ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవాలని మెమొరాండం అందజేశారు. ఇందులో ప్రధానంగా పోలవరం నిర్మాణం కోసం అడహక్‌గా రూ. 10 వేల కోట్లు, డయాఫ్రమ్‌వాల్‌ మరమ్మతు కోసం రూ. 2 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 2,600 కోట్లు వెంటనే రిలీజ్‌ చేయాలన్నారు. అలాగే, సవరించిన రూ.55,548 కోట్ల పోలవరం అంచనాలను ఆమోదించాలని అమిత్‌షాను కోరారు.

పోలవరం తర్వాత ప్రధానంగా విభజన సమస్యలు, హామీలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు జగన్‌. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ హామీల అమలు జరగలేదని గుర్తుచేశారు. విభజన సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రత్యేక హోదా లాంటి హామీలను నెరవేర్చాలని కోరారు. పోలవరం, విభజన సమస్యల తర్వాత రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై అమిత్‌షాకి మెమొరాండం ఇచ్చారు. రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఏపీకి రావాల్సిన రూ. 36,625కోట్లను వెంటనే ఇప్పించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

FRBM సీలింగ్‌ను సవరించి, కొత్త రుణాలు తెచ్చుకోవడానికి పర్మిషన్‌ ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేశారు. అలాగే, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.7,058 కోట్ల విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు జగన్‌. ఆహార భద్రత లబ్దిదారుల ఎంపికలో ఏపీకి అన్యాయం జరుగుతోందన్న సీఎం జగన్‌.. రాష్ట్రానికి 77వేల టన్నుల రేషన్‌ కేటాయించాలని కోరారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే ఏపీపై రూ. 5,527 కోట్ల భారం తగ్గుతుందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.

ఇక, ఫైనల్‌గా కొత్తగా 12 మెడికల్ కాలేజీలకు పర్మిషన్‌ ఇవ్వడంతోపాటు ఆర్ధిక సాయం చేయాలన్నారు సీఎం జగన్‌. టోటల్‌గా అరగంటపాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం రాత్రి 9గంటలకు మీటింగ్‌ జరగాల్సి ఉండగా, రెండు గంటలు ఆలస్యంగా భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన...
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..