Rama Navami: అద్భుతం.. కోడి ఈకపై శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవ ఘట్టం..
సీతారాముల కళ్యాణం అంటే ఓ పర్వదినం. అదో లోక కళ్యాణం. అందుకే శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ఎవరికివారు సీతారాముల కళ్యాణంలో తమకు తోచినట్టు పాలుపంచుకుంటారు. ఆ సీతారాముల పట్ల తమ భక్తి ప్రవర్తలను చాటుకుంటారు. శ్రీరామనవమి

సీతారాముల కళ్యాణం అంటే ఓ పర్వదినం. అదో లోక కళ్యాణం. అందుకే శ్రీరామనవమి వచ్చిందంటే చాలు ఎవరికివారు సీతారాముల కళ్యాణంలో తమకు తోచినట్టు పాలుపంచుకుంటారు. ఆ సీతారాముల పట్ల తమ భక్తి ప్రవర్తలను చాటుకుంటారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళంకి చెందిన రాహుల్ పట్నాయిక్ అనే చిత్రకారుడు కోడి వెంట్రుకపై రూపొందించిన శ్రీరాములవారి పట్టాభిషేక ఘట్టం మైక్రో ఆర్ట్ అందరి చేత ఔరా అనిపిస్తోంది.
శ్రీరామ నవమి వచ్చిందంటే చాలు శంకుచక్రాలు, తిరునామాలు, సీతా రాముల వారి పేర్ల తో అలంకరించ బడ్డ శ్రేష్ఠమైన కొబ్బరి బొండాలు డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుండి భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవంకి తరలి వెళ్తాయి. మండపేటకి చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన ఈ కొబ్బరి బొండాలను స్వామి వారి వివాహానికి కానుకగా ప్రతి ఏటా అందజేస్తూ ఉంటారు.
అలాగే మరో భక్తుడు గోటితో వడ్లను వలచి.. ఆ బియ్యంతో తలంబ్రాలను చేసి భద్రాచలం సీతారాముల కళ్యాణానికి ప్రతిఏటా పంపిస్తుంటారు. శ్రీరామ నవమి వచ్చిందంటే చాలు భక్తులు ఇలా ఎవరికి వారు శ్రీ సీతా రాముల వారి పట్ల తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. యావత్ భారతావనికి శ్రీరామ నవమి ఓ పర్వదినం. అలాంటి శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళానికి చెందిన రాహుల్ పట్నాయక్ అనే మైక్రో ఆర్ట్ చిత్రకారుడు కోడి వెంట్రుకపై శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని అద్భుతంగా మలిచాడు. ఆ వెంట్రుక పై సింహాసనంపై శ్రీ సీతారాములు వారు ఆసీనులై ఉండగా, పాదాల చెంత హనుమంతుడు, సింహాసనానికి ఇరువైపులా రాముల వారి పరివారం కొలువుదీరి ఉన్నట్టు వేసిన మైక్రో ఆర్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.




కోడి వెంట్రుక పై శ్రీ రాముల వారి పట్టాభిషేకం ఘట్టం వేసేందుకు చాలా శ్రమ పడ్డాడు రాహుల్ పట్నయిక్. ఇతనికి ఈ ఆర్ట్ వేసేందుకు ఏక దాటిన మూడు గంటల సమయం పట్టింది. కోడి వెంట్రుక పై ఆర్ట్ కావటంతో ఎటువంటి లైనింగ్ లేకుండా.. చాలా ఓపికతో రంగులద్దుతూ ఆర్ట్ ని పూర్తి చేశాడు రాహుల్ పట్నాయక్.
రాహుల్ పట్నాయక్ కి చిన్నప్పటి నుండి చిత్ర లేఖనం,పెయింటింగ్ అంటే మక్కువ ఎక్కువ. ఏ గురువు సహాయం లేకుండా స్వతహాగానే వీటిని రాహుల్ పట్నాయక్ నేర్చుకోవటం విశేషం. రాముల వారి పట్టాభిషేకమే కాదు గతoలో శ్రీనివాసుని కళ్యాణం కూడా కోడి వెంట్రుకపై అందంగా చిత్రీకరించి ఔరా అనిపించుకున్నాడు. అంతే కాదు బియ్యపు గింజపై సైతం ఎన్నో అధ్భుత మైక్రో పెయింటింగ్స్ వేసి అందరినీ అబ్బుర పరిచాడు రాహుల్ పట్నాయిక్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
