AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబుకు లేఖ.. విషయం ఏంటంటే..?

Andra Pradesh: అల్లూరి 125వ జయంతి వేడుకలు సందర్భంగా పార్లమెంటులో సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి..

Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబుకు లేఖ.. విషయం ఏంటంటే..?
Chandrababu
Shiva Prajapati
|

Updated on: Jul 02, 2022 | 5:56 PM

Share

Andra Pradesh: అల్లూరి 125వ జయంతి వేడుకలు సందర్భంగా పార్లమెంటులో సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లేఖ రాశారు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. భారత స్వాతంత్య్ర 75వ వసంతాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరి సీతారామరాజును స్మరించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చినందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 2022 జులై 4న భీమవరంలో చేపట్టనున్న అల్లూరి విగ్రహ ఆవిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తిండిపోతుందన్నారు.

కాగా, ఈ ఏడాదే అల్లూరి సీతారామ రాజు గారి 125వ జయంతి వేడుకలు ఉండటం ఆనందదాయకం అని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అల్లూరి 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరారు. అల్లూరి సీతారామ రాజు స్వాతంత్ర్యం కోసం చేసిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. అల్లూరి ఏజెన్సీ ప్రాంత గిరిజనుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారని అన్నారు. నేటికీ అల్లూరి పేరు ఈ ప్రాంత ప్రజలలో మారుమోగుతోందన్నారు. అల్లూరి సీతారామ రాజు ‘మన్యం వీరుడు’, ‘విప్లవ జ్యోతి’ గా నేటికి ప్రసిద్ధి అని కీర్తించారు. బ్రిటీష్ ఫైరింగ్ స్క్వాడ్ చే రామరాజు క్రూరంగా కాల్పులు చేసి చంపబడ్డారని, అల్లూరి జీవితం స్వాతంత్య్రోద్యమ స్పూర్తికి, త్యాగం, ధైర్యసాహసాలకు నిలువుటద్దం అని పేర్కొన్నారు.

కాగా, ‘‘నాడు టీడీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటు హాల్లో ఏర్పాటు చేయాలని 13వ లోక్‌సభలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ నాడు కేంద్రంలో, ఏపీలో ప్రభుత్వాలు మారడంతో విగ్రహ ప్రతిష్ఠాపనలో జాప్యం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున.. ఎటువంటి జాప్యం లేకుండా అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతున్నాము.’’ అని చంద్రబాబు తన లేఖలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అల్లూరిని సత్కరించుకోవడం అంటే దేశ స్పూర్తిని, గిరిజన జాతులను గౌరవించుకోవడమే అని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..