Andhra Pradesh: అయ్యో అయ్యో అయ్యయ్యో.. వేల మద్యం బాటిళ్లు ఓ వైపు.. జేసీబీ మరో వైపు.. కట్ చేస్తే

మందు తాగేటప్పుడు ఒక్క చుక్క కింద పడినా గుండె ఆగినంతపని అవుతుంది. ఇక గ్లాసుల్లో మందు పోసేటప్పుడు ప్రతి ఒక్కరూ సైంటిస్టే. జాగ్రత్తగా కొలిచి, ఎక్కువ తక్కువ రాకుండా గ్లాస్ లో పోస్తారు. ఇలా ఒక్క చుక్క మద్యాన్నైనా వదలని మద్యం ప్రియులు ఈ...

Andhra Pradesh: అయ్యో అయ్యో అయ్యయ్యో.. వేల మద్యం బాటిళ్లు ఓ వైపు.. జేసీబీ మరో వైపు.. కట్ చేస్తే
Wine Destroying In Mummidia
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 02, 2022 | 3:23 PM

మందు తాగేటప్పుడు ఒక్క చుక్క కింద పడినా గుండె ఆగినంతపని అవుతుంది. ఇక గ్లాసుల్లో మందు పోసేటప్పుడు ప్రతి ఒక్కరూ సైంటిస్టే. జాగ్రత్తగా కొలిచి, ఎక్కువ తక్కువ రాకుండా గ్లాస్ లో పోస్తారు. ఇలా ఒక్క చుక్క మద్యాన్నైనా వదలని మద్యం ప్రియులు ఈ వీడియో చూస్తే ఏమైపోతారో.. అయ్యో అయ్యో అంటూ నాలుక చప్పరించుకోవడం తప్పు వారేమీ చేయలేని పరిస్థితి వస్తే ఆ బాధను మాటల్లో వర్ణించలేం. తాజాగా అక్రమంగా స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు జేసీబీతో తొక్కించారు. సంవత్సర కాలంగా ఎంతో భద్రంగా చూసుకుంటున్న సీజ్ చేసిన మద్యాన్ని వరసగా పేర్చి జేసీబీ(JCB) తో తొక్కించేశారు. ఆ బాటిళ్లలోని వైన్ అంతా నేలపై వరదలా పారింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కోనసీమ (Konaseema) జిల్లా ముమ్మిడివరంలో అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. సంవత్సర కాలం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్న పోలీసులు వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, జేసీబీ తో తొక్కించారు.

ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ. పోలవరం పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన అక్రమ‌ మద్యాన్ని‌ ద్వంసం చేసిన ఎస్ఈబీ అధికారులు.. గత సంవత్సరం కాలంగా పట్టుబడిన 7,950 బాటిళ్లను ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని‌ అధికారులు తెలిపారు. 7,950 బాటిళ్ల మద్యం, 20 లీటర్ల నాటుసారాను జేసీబీతో తొక్కించి ధ్వంసం చేయించారు. అక్రమ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోవద్దని ఎస్ఈబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..