AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉడత చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు

నిన్నటి వరకు ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుల మధ్య చిచ్చు రేపేది..ఏ ఎన్నికలు జరిగినప్పుడో..! లేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడో.. లేక ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నప్పుడో పొలిటికల్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో చిన్న ఉడత వల్ల...

Andhra Pradesh: ఉడత చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు
Auto Fire In Sri Satyasai D
Ganesh Mudavath
|

Updated on: Jul 02, 2022 | 4:54 PM

Share

నిన్నటి వరకు ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుల మధ్య చిచ్చు రేపేది..ఏ ఎన్నికలు జరిగినప్పుడో..! లేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడో.. లేక ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నప్పుడో పొలిటికల్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో చిన్న ఉడత వల్ల రాజకీయ చిచ్చు రేగింది. ఉడత వల్ల కరెంట్ తీగలు తెగుతాయా.. ఐదు మంది సజీవ దహనం అవుతారా.. అంటూ ప్రభుత్వం పై అక్కడి నేతలు ఒంటికాలుపై లేస్తున్నారు. ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నా.. విద్యుత్ శాఖ అధికారులు మాత్రమే అవును ఉడత వలనే ప్రమాదం జరిగిందని నొక్కి వక్కానించి చెబుతున్నారు. మొత్తం ఘటనకు కారణమైన ఉడతకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఏంటా ప్రమాదం.. ఉడతే ఇంత పని చేసిందా… ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాలో ఒక ఉడుత చేసిన పని వలన ఐదు మంది సజీవ దహనమ్యయారు. అదే ఉడత వల్ల రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తోంది. మొత్తం ఒక వ్యవస్థలో అధికారులంతా సమాధానం చెప్పుకునే పరిస్థితి. ఇంతకీ అంత ఘోరం ఆ ఉడత చేసిందా అంటే అవుననే చెబుతున్నారు అధికారులు. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఉడత కథలు ఆపండంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఉడత ఏం చేసింది.

శ్రీ సత్యసాయి జిల్లాలో గత గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణం ఒక ఉడత అని అధికారులు, అటు గ్రామస్థులు చెబుతున్నారు. ఉడత వలన కరెంట్ తీగలు ఎలా పడ్డాయి అంటే.. పడ్డాయనే అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఒక ఉడత వలన కరెంట్ తీగలు పడితే ఇంకా ఎన్ని ప్రమాదాలు జరగాలంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు బీజేపీ, జనసేన, వామపక్షాలు ఇలా అంతా ఒన్ సైడ్ బ్యాటిల్ అన్నట్టు ప్రభుత్వం పై విరుచకుపడుతున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ వింతలే జరుగుతున్నాయని.. ఈ ప్రభుత్వంలో ఎలుకలు మద్యం తాగుతాయ్.. కోతులు, కుక్కలు సాక్ష్యాలు ఎత్తుకెళ్తాయ్.. ఇప్పుడు ఉడతలు కరెంట్ తీగలు తెంపేసి ఐదు మందిని చంపుతాయని ఘాటు మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా కరెంట్ తీగలకు ఉడత తగిలితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయా.. అంటే కరెంట్ తీగలు ఉడతలు కొరికితే తెగిపోయేంత బలహీనంగా ఉన్నాయా అని నిలదీశారు. ప్రతిపక్షాలన్నీ ఇలానే టార్గెట్ చేస్తుంటే మీరు అధికార పార్టీ నుంచి మాత్రం నో కామెంట్స్. ఎందుకంటే ఈ విషయాన్ని వారు కూడా బలంగా చెప్పలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి

కానీ అధికారులు మాత్రం ఉడత వల్లే ప్రమాదం జరిగిందన్న మాటను మార్చడం లేదు. ఐదుగురు సజీవ దహమైన సంఘటనపై ఉన్నత స్థాయిలో విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టింది. శుక్రవారం మొత్తం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇటు ఎస్పీడీసీఎల్ అధికారులు కూడా అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. వీరందరూ ప్రాథమికంగా చెబుతున్నది ఒకటే ఉడత ఏక కాలంలో కరెంట్ తీగకు పక్కనే అమర్చిన ఒక ఇనుప రాడ్ కు తగలడం వలన ప్రమాదం షార్ట్ సర్క్యూట్ అయిందని చెబుతున్నారు. ఆ సమయంలో విద్యుత్ తీగలు పడటం.. ఆటో పైన ఒక ఇను బోన్ లాంటిది ఉండటం వలన దానికి తీగలు తగిలి ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఇందుకు ఉడత తోక భాగంలో కాలిపోయిన ఆనవాళ్లను చూపుతున్నారు. అంతే కాదు ఉడుతకు పోస్టు మార్టం కూడా నిర్వహించారు.

అధికారులు చెబుతున్న మాటలు నిజమే అనుకున్నా ప్రతిపక్షాలు కొందరు నిపుణులు లేవనెత్తున సందేహం ఒక్కటే. షార్ట్ సర్క్యూట్ విద్యుత్ తీగలు తెగితే ఉడత మొత్తం కాలిపోవాలి కదా.. అలా ఎందుకు జరగలేదన్నది మొదటి ప్రశ్న. అదిపక్కన పెడితే ఎప్పుడైనా వైర్లు షాట్ అయినా.. అలాగే తెగిపడినా వెంటనే ట్రిప్ కావాలి. ఈ వ్యవస్థ రెండ దశల్లో ఉంటుంది. ఒక సబ్ స్టేషన్ లో పని చేయకపోయినా ఇంకో సబ్ స్టేషన్ లో అయినా ఇది జరగాలి. కానీ అలా జరగకపోవడానికి కారణాలేంటి.. అంటే విద్యుత్ శాఖలో తప్పిదం జరిగిందన్నది బలంగా చెబుతున్నారు. అంతే కాదు తీగ నాణ్యత, దానికున్న జాయింట్లు చూస్తే ఆ శాఖ సిబ్బంది ఎంత బాగా పని చేస్తున్నారో అర్థమవుతోంది.

లోపాలు ఇన్ని స్థాయిల్లో ఉన్నా నెపం మాత్రం ఉడత మీద వేశారు. అందుకే రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నాయి. అయితే దీని వైసీపీ నేతల నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..