AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET: ఈఏపీసెట్‌-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అభ్యర్థులు ఈ విషయాలు అస్సలు మరవద్దు..

AP EAPCET 2022: ఏపీ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్న స్తాయి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు తెలిపారు...

AP EAPCET: ఈఏపీసెట్‌-2022 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అభ్యర్థులు ఈ విషయాలు అస్సలు మరవద్దు..
Narender Vaitla
|

Updated on: Jul 02, 2022 | 6:53 PM

Share

AP EAPCET 2022: ఏపీ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్న స్తాయి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్‌, 11,12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 122 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. వీటిలో 2 సెంటర్లు తెలంగాణలో కూడా ఉన్నాయి.

ఈ పరీక్షలకు మొత్తం 3 లక్షల 84 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌ మొదలనప్పటికీ ఇంకా.. 14 వేల మంది ఇంకా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. పరీక్షా సెంటర్‌లకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ను హాల్‌ టికెట్‌లతో పాటు ఇస్తున్నామని ఏపీఎస్సిహెచ్ఈ చైర్మన్ హేమ చంద్రా రెడ్డి తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. హాల్ టికెట్‌తో పాటు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలి. ఒక నిమిషం ఆలస్యం అయితే రూల్ ప్రకారం పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి లేదు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకోవాలి. ఎస్సి, ఎస్టీలు మాత్రమే కాస్ట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి, మిగతా విద్యార్థులుహాల్ టికెట్, ఐడి ప్రూఫ్ విద్యార్థులు తెచ్చుకోవాలి.

ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చినా, ఒకరి బదులు ఒకరు పరీక్ష రాసినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్ లు, మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరామని, విద్యార్థులు మాస్క్ తప్పని సరిగా తెచ్చుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే 08554-234311,232248 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు తెలపవచ్చని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..