Varupula Raja: ఏపీలో విషాదం.. టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం.. గుండెపోటుతో

ఏపీ ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడలోని సూర్య గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు.

Varupula Raja: ఏపీలో విషాదం.. టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం.. గుండెపోటుతో
Varupula Raja
Follow us

|

Updated on: Mar 05, 2023 | 7:10 AM

ఏపీ ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు రావడంతో కాకినాడలోని సూర్య గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన ఇక లేరన్న విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నియోజకవర్గ శ్రేణులు కన్నీరు మున్నీరయ్యారు. జిల్లాలోని నేతలంతా దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం మూడు రోజులుగా బొబ్బిలి, సాలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావుకు మద్దతుగా రాజా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రమే ఆయన ప్రత్తిపాడు వచ్చారు. రాత్రి 9 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో స్థానికంగా ఈసీజీ తీయించారు. ఆ కాపీని విశాఖపట్నంలోని ఓ ప్రముఖ వైద్యుడికి వాట్సాప్‌లో పంపారు. అది పరిశీలించిన వైద్యుడు తక్షణం కాకినాడకు తరలించాలని ఆదేశించారు. దీంతో రాజాను కారులో ఎక్కించి కాకినాడ హుటాహుటిన సూర్య గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోకి వెళ్లిన తర్వాత పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన రాత్రి 10 గంటలకు అపోలో ఆసుపత్రికి రాజాను తీసుకువచ్చారు. అక్కడికి వచ్చిన రాజా స్వయంగా కారు దిగి గుండెపై చేయి వేసుకుని నొప్పితో ఆసుపత్రిలోకి వెళ్లారు. వెంటనే కుప్పకూలిపోయారు. సీపీఆర్‌ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. దీంతో రాత్రి 11 గంటలకు రాజా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన చనిపోయారని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

రాజాకు భార్య సత్యప్రభ, కుమార్తె సత్యమాధురి, కుమారుడు సాయితర్షిత్‌ ఉన్నారు. బీకాం వరకు చదివిన రాజా స్వస్థలం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామం. రాజా భౌతికకాయాన్ని ప్రత్తిపాడుకు తరలించారు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు. ఈరోజు రాజా అంత్యక్రియలు జరగనున్నాయని సన్నిహితులు తెలిపారు. విషయం తెలిసి టీడీపీ నేతలు జ్యోతుల నవీన్‌, కొండబాబు, మాజీ మేయర్‌ పావని, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హుటాహుటిన ఆస్పత్రికి తరలివచ్చారు. వరుపుల రాజాకు ఐదేళ్ల కిందట ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పట్లో వైద్యులు రాజా గుండెకు స్టంట్‌ అమర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!