Polavaram: రివర్స్ టెండరింగ్ అని గొప్పలు చెప్పుకుంటే చివరికి ప్రాజెక్టే రివర్స్ అయింది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ ధ్యంసం ఘటనపై వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలతో పోలవరం(Polavaram) ప్రాజెక్టును బలి చేశారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్ ఘటనపై...

Polavaram: రివర్స్ టెండరింగ్ అని గొప్పలు చెప్పుకుంటే చివరికి ప్రాజెక్టే రివర్స్ అయింది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్
Chandra Babu
Follow us

|

Updated on: Jun 03, 2022 | 9:52 AM

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ ధ్యంసం ఘటనపై వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలతో పోలవరం(Polavaram) ప్రాజెక్టును బలి చేశారని మండిపడ్డారు. డయాఫ్రం వాల్ ఘటనపై వైసీపీ నూరు శాతం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ అని గొప్పలు చెప్పుకుంటే.. చివరికి ప్రాజెక్టే రివర్స్ అయిందని ఆక్షేపించారు. బాదుడే బాదుడు, పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. 2020 లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం 2022 వచ్చినా ఎందుకు పూర్తి చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ ఇప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. అంతే కాకుండా నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించిందని చంద్రబాబు తెలిపారు.

చట్టసభ సభ్యుడు చనిపోయినప్పుడు, వారి కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికలో టిక్కెట్‌ ఇస్తే పోటీ చేయకూడదన్న విధానాన్ని టీడీపీ పాటిస్తోంది. అందుకే ఆత్మకూరు ఉప ఎన్నికలోనూ పోటీ చేయట్లేదు. బద్వేల్‌లో ఎందుకు పోటీ చేయలేదో, ఆత్మకూరులోనూ అందుకే పోటీ చేయడం లేదు. రాజకీయాల్లో కొన్ని సంప్రదాయాలు పాటించాలి. ఒక్క నెలలోనే రూ.9,500 కోట్ల అప్పులు తెచ్చారంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతల అకృత్యాలకు అంతం లేకుండా పోతోంది. ఇది దేనికి సంకేతం.

– చంద్రబాబు, టీడీపీ అధినేత

ఇవి కూడా చదవండి

మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ గురించి నిజానిజాలు తేల్చాలని నేతలు పట్టుబడుతున్నారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఈ విషయం గురించి చర్చించేందుకు రావాలని సవాల్ విసిరారు. ఎవరి చర్య వల్ల దెబ్బతిందో తేల్చుకుందామని పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమకూ సవాల్‌ విసిరారు. కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే వరదలకు దెబ్బతిందని మంత్రి అన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి