IND vs WI Schedule: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్ రెడీ.. తొలిసారి అమెరికాలో టీ20 సిరీస్..

వెస్టిండీస్‌తో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. జులై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే వన్డే మ్యాచ్‌తో పర్యటన ప్రారంభమవుతుంది.

IND vs WI Schedule: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్ రెడీ.. తొలిసారి అమెరికాలో టీ20 సిరీస్..
Ind Vs Wi
Follow us
Venkata Chari

|

Updated on: Jun 03, 2022 | 5:55 AM

ఇంగ్లండ్‌ పర్యటన ముగిసిన తర్వాత భారత్‌ వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం క్రికెట్ వెస్టిండీస్ టూర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. విశేషమేమిటంటే.. ఈ సమయంలో చివరి రెండు టీ20 మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్నాయి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జులై 22న వన్డే మ్యాచ్‌తో వెస్టిండీస్ పర్యటన ప్రారంభమవుతుంది. దీని తర్వాత మిగిలిన రెండు వన్డేలు (24, 27 జులై) ఈ మైదానంలో జరగనున్నాయి. ఆ తర్వాత మూడు వేర్వేరు వేదికల్లో ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. జులై 29న బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్)లో తొలి టీ20 జరగనుంది. తర్వాత వార్నర్ పార్క్‌లో రెండో, మూడో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరి రెండు టీ20 మ్యాచ్‌లు ఆగస్టు 6, 7 తేదీల్లో ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో జరగనున్నాయి.

విండీస్‌లో భారత పర్యటన షెడ్యూల్:

22 జులై, తొలి వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్

ఇవి కూడా చదవండి

24 జులై, రెండో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్

27 జులై, మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్

(భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్‌లు మొదలవుతాయి)

29 జులై, తొలి టీ20ఐ, పోర్ట్ ఆఫ్ స్పెయిన్

1 ఆగస్ట్, రెండో టీ20ఐ, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్

2 ఆగస్ట్, మూడో టీ20ఐ, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్

6 ఆగస్ట్, నాలుగో టీ20ఐ, ఫ్లోరిడా

7 ఆగస్ట్, ఐదో టీ20ఐ, ఫ్లోరిడా

(అన్ని T20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలుకానున్నాయి)

వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ రాబోయే సిరీస్ గురించి మాట్లాడుతూ, “వెస్టిండీస్ తరపున క్రికెట్ ఆడేందుకు యువ జట్టు సిద్ధంగా ఉంది. మా వంతు ప్రయత్నం చేస్తాం” అంటూ పేర్కొన్నాడు. జులై 17తో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనను ముగించనుంది. ఆ టూర్‌లో పాల్గొనే ఆటగాళ్ల నుంచి ఎంపికైన వారు నేరుగా ఇంగ్లండ్‌ నుంచి వెస్టిండీస్‌కు బయలుదేరుతారు. భారత్-విండీస్ సిరీస్ ‘ఫ్యాన్‌కోడ్’ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..