AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: ఖరీదైన కారు కొన్న కేకేఆర్ కెప్టెన్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

IPL 2022లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో KKR తరపున ప్రదర్శన ప్రత్యేకంగా ఏంలేదు. దీంతో కోల్‌కతా ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయింది.

Shreyas Iyer: ఖరీదైన కారు కొన్న కేకేఆర్ కెప్టెన్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Shreyas Iye
Venkata Chari
|

Updated on: Jun 03, 2022 | 5:35 AM

Share

టీమిండియా బ్యాట్స్‌మెన్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విలాసవంతమైన మెర్సిడెస్-ఎఎమ్‌జీ జీ 63 4మాటిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. అయ్యర్ ఒక SUVని కొనుగోలు చేసిన ఫోటోలను ముంబైకి చెందిన కార్ల విక్రయదారులు షేర్ చేశారు. ఈ మెర్సిడెస్ ధర రూ.2.45 కోట్లు. Mercedes-AMG G 63 4MATIC అనేది G-వ్యాగన్ సిరీస్ టాప్ ఎడిషన్. AMG 4.0-లీటర్ V8 బిటుర్బో ఇంజన్‌తో ఆధారితంగా పనిచేస్తోంది. దీని అవుట్‌పుట్ 430 kW (585 HP), గరిష్ట టార్క్ 850 Nmగా ఉంటుంది. దీని వేగం గురించి చెప్పాలంటే, ఈ SUV కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది.

సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకుంటూ, ల్యాండ్‌మార్క్ కార్స్ ముంబై దాని విశేషాలతో పాటు శ్రేయాస్‌కు అభినందనలు తెలిపింది. ‘కొత్త Mercedes-Benz G63 కొనుగోలు చేసినందుకు భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌కు అభినందనలు. మేము మిమ్మల్ని స్టార్ ఫ్యామిలీకి స్వాగతిస్తున్నాం. మీ కవర్ డ్రైవ్‌ని చూసి మేం ఆనందించినంతగా.. మీరు ఈ స్టార్‌తో కూడా అలాగే హ్యాపిగా ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది.

కోల్‌కతా తరపున నిరుత్సాహకర ప్రదర్శన..

ఇవి కూడా చదవండి

IPL 2022లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో KKR ప్రదర్శన ప్రత్యేకంగా ఏంలేదు. దీంతో కోల్‌కతా ప్లేఆఫ్‌లకు చేరుకోలేకపోయింది. మెగా వేలంలో కేకేఆర్ రూ.12.25 కోట్లకు శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. శ్రేయాస్ అయ్యర్ IPL 2022లో 14 మ్యాచ్‌లలో 30.84 సగటుతో 401 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు.

27 ఏళ్ల శ్రేయాస్ ఇప్పటివరకు 101 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడాడు. 31.55 సగటు, 125.38 స్ట్రైక్ రేట్‌తో 2776 పరుగులు చేశాడు. అయ్యర్ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్‌లో 19 అర్ధ సెంచరీలు కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు 4 టెస్టులు, 26 వన్డేలు, 36 టీ20 ఇంటర్నేషనల్స్‌లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లోనూ శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నాడు.