BCCI Chief Ganguly: బీసీసీఐ చీఫ్ గంగూలీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారా? ఆ ట్వీట్‌లోని ఆంతర్యం అదేనా?

BCCI Chief Ganguly: బీసీసీఐ చీఫ్‌ గంగూలీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టబోతున్నారు. ఇక పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టబోతున్నారు ఈ మాజీ క్రికెటర్‌.

BCCI Chief Ganguly: బీసీసీఐ చీఫ్ గంగూలీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారా? ఆ ట్వీట్‌లోని ఆంతర్యం అదేనా?
Ganguly
Follow us

|

Updated on: Jun 02, 2022 | 8:21 AM

BCCI Chief Ganguly: బీసీసీఐ చీఫ్‌ గంగూలీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టబోతున్నారు. ఇక పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టబోతున్నారు ఈ మాజీ క్రికెటర్‌. భారత క్రికెట్‌ను శాసించిన సౌరవ్‌.. లేటెస్ట్‌గా రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అవును, సౌరవ్‌ గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. BCCI అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని, త్వరలోనే రాజకీయరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు గంగూలీ. తన తదుపరి ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎందరికో ఉపయోగపడే ఓ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ట్వీట్ చేసిన ఆయన.. 1992లో క్రికెట్‌లో అడుగుపెట్టానని, 2022తో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నానన్నారు గంగూలీ. నాటి నుంచి క్రికెట్ నాకెంతో ఇచ్చిందన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన.. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు గంగూలీ. భవిష్యత్‌లోనూ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నానంటూ దాదా ట్వీట్ చేశారు. రాజీనామా తర్వాత.. గంగూలీ బీజేపీలో చేరే అవకాశమున్నట్టు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు అమిత్‌షాతో సమావేశమయ్యారు సౌరవ్‌. కొన్ని రోజుల కిందట బీజేపీ నేతలు గంగూలీ నివాసానికి వెళ్లి, చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు TMC నేతలు కూడా గంగూలీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే బీజేపీలో కనుక చేరితే.. గంగూలీకి బెంగాల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఇదిలాఉంటే.. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలను కొట్టిపారేశారు ఆ సంస్థ కార్యదర్శి జైషా. అవన్నీ అవాస్తవాలేనని, గంగూలీ రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. టీమ్​ఇండియా తదుపరి ప్రాజెక్టులపైనే ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలిపారు.