IND vs SA: ప్రపంచ రికార్డు దిశగా టీమిండియా.. అలా చేసిన తొలి జట్టుగా అవతరించే ఛాన్స్.. అదేంటంటే?
Team India: రెండు నెలల ఐపీఎల్ తర్వాత మరోసారి టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేస్తోంది. ఇక్కడ టీమింయాకు సరికొత్త ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య స్వదేశంలో జూన్ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2022 తర్వాత టీమిండియా షెడ్యూల్ బిజీగా తయారైంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీ20లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచ రికార్డుపై టీమ్‌ఇండియా దృష్టి పడింది. భారత్ ఇప్పటి వరకు వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచి ఆఫ్ఘనిస్థాన్, రొమేనియాతో సమానంగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. వరుసగా 13 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు గెలిచిన ప్రపంచంలోనే తొలి జట్టుగా రికార్డులకెక్కుతుంది. అంతకుముందు, టీ20 ప్రపంచకప్‌లో చివరి మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా ఏ మ్యాచ్ ఓడిపోకుండా న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుంది.
దక్షిణాఫ్రికాపై బరిలోకి కొత్త టీమిండియా..




దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కొత్త టీమిండియా ఎంపికైంది. ఈ సిరీస్‌లో సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఐపీఎల్‌లో నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి ఆటగాళ్లకు తొలిసారిగా జట్టులో అవకాశం దక్కింది. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి జట్టులోకి తిరిగి వస్తున్నారు. దినేష్ కార్తీక్ 3 సంవత్సరాల తర్వాత భారత్ తరపున టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటం చూడొచ్చు. ఈ జట్టు కమాండ్‌ని కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. అదే సమయంలో రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.




