AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: 5 బంతుల్లో 3 వికెట్లు.. కేవలం 4 ఓవర్లలోనే బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు.. కుల్దీప్‌కు పోటీగా సిద్ధం చేస్తోన్న ఆ జట్టు..

తన స్విర్లింగ్ బంతులతో లీసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మెన్‌లను చావు దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

Watch Video: 5 బంతుల్లో 3 వికెట్లు.. కేవలం 4 ఓవర్లలోనే బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు.. కుల్దీప్‌కు పోటీగా సిద్ధం చేస్తోన్న ఆ జట్టు..
T20 Blast Jake Lintott
Venkata Chari
|

Updated on: Jun 03, 2022 | 6:10 AM

Share

టీ20 బ్లాస్ట్ ఒక బౌలర్ చేసిన వినాశనాన్ని చవిచూసింది. అతని చరిత్ర ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు (England Test Team)తో ఏమాత్రం సంబంధం లేదు. కేవలం 4 ఓవర్లలోనే ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆబౌలర్.. 5 బంతుల్లో ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ చేర్చి, ప్రత్యర్థి జట్టును చావుదెబ్బ తీశాడు. టీ 20 బ్లాస్ట్‌(T20 Blast)లో విధ్వంసం సృష్టించిన బౌలర్.. టీమిండియా స్టార్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు సవాలు విసిరేందుకు ఇంగ్లండ్ తయారు చేస్తోందని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ బౌలర్‌ను ఇంగ్లండ్ టీం నెట్ బౌలర్‌గా ఎంచుకుంది. ఆ బౌలర్ ఎవరంటే జేక్ లింటోట్ (Jake Lintott). లీసెస్టర్‌షైర్ వర్సెస్ బర్మింగ్‌హామ్ బేర్స్ మ్యాచ్‌లో లింటోట్ బంతితో విధ్వంసం సృష్టింంచి ప్రస్తుతం చర్చల్లో నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో, లింటోట్ బర్మింగ్‌హామ్ బేర్స్‌లో భాగంగా ఉన్నాడు. అతను తన స్విర్లింగ్ బంతులతో లీసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మెన్‌లను చావు దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

4 ఓవర్లలో 27 పరుగులకే 4 వికెట్లు..

లీసెస్టర్‌షైర్‌లో పడిన 9 వికెట్లలో 4 వికెట్లను జేక్ లింటోట్ పడగొట్టాడు. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఈ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లిన్నోట్ బౌలింగ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే, అతను తన 4 వికెట్లలో 3 వికెట్లను ఒకే ఓవర్‌లో 5 బంతుల విరామంలో తీయడం. అయితే, అతను లీసెస్టర్‌షైర్ కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా మ్యాచ్‌లో తన వికెట్ల క్రమాన్ని ప్రారంభించాడు.

5 బంతుల్లో 3 వికెట్లు..

పవర్‌ప్లే ముగిసిన తర్వాత జేక్ లింటోట్ తన మొదటి వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2 పరుగులు మాత్రమే చేయగలిగిన లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కోలిన్ ఎక్మాన్‌ను అవుట్ చేశాడు. దీని తర్వాత, అతను లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌లో తన మిగిలిన 3 వికెట్లను తీశాడు. ఈ ఓవర్ తొలి బంతికే 51 బంతుల్లో 72 పరుగులతో ఆడుతున్న ఓపెనర్ స్కాట్ స్టీల్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి నవీన్‌ ఉల్‌ హక్‌, 5వ బంతికి పార్కిన్‌సన్‌ అవుటయ్యాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు.

మరిన్ని క్రికెట్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!