Vangaveeti: వంగవీటి రాధ వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఐసీయులో ఉన్న వ్యక్తి రెక్కీ ఎలా చేశారు?

వంగవీటి రంగా వర్థంతి రోజు ఆయన కుమారుడు వంగవీటి రాధ చేసిన కామెంట్స్‌ కాకరేపాయి. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని, రెక్కీ నిర్వహించారని రాధ కామెంట్స్‌ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.

Vangaveeti: వంగవీటి రాధ వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఐసీయులో ఉన్న వ్యక్తి రెక్కీ ఎలా చేశారు?
Vangaveeti Radha
Follow us

|

Updated on: Dec 29, 2021 | 1:10 PM

Chandrababu phone call to Vangaveeti Radha: వంగవీటి రంగా వర్థంతి రోజు ఆయన కుమారుడు వంగవీటి రాధ చేసిన కామెంట్స్‌ కాకరేపాయి. తనను హత్య చేసేందుకు కుట్ర చేశారని, రెక్కీ నిర్వహించారని రాధ కామెంట్స్‌ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో రాధ చేసిన కామెంట్స్‌ రచ్చ రాజేశాయి. దీంతో రాధకు సెక్యూరిటీ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, తనకు భద్రత వద్దని, తాను ప్రజల్లో ఉండే మనిషినని చెప్పారు రాధ.

ఈ నేపథ్యంలో వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో సమగ్ర విచారణ ద్వారా తేలే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేసమయంలో వంగవీటి రాధాకు ఏం జరిగినా ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా, భయనంకరంగా దిగజారిపోయివున్నాయని చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలు ఆటవిక పాలను తలపిస్తున్నాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, వంగవీటి రాధకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. వ్యక్తిగత భద్రత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపించవద్దని చంద్రబాబు.. ప్రభుత్వం కేటాయించిన భద్రతను తిరస్కరించడం సరికాదన్నారు. అలాగే, ధైర్యంగా ఉండాలని, తాను, తమ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని వంగవీటి రాధకు చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు వంగవీటి రాధా సెన్సేషనల్‌ కామెంట్స్‌ తర్వాత బెజవాడలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. విజయవాడ అంతటా రాధా అనుచరులు ఆందోళనలకు దిగుతున్నారు. దేవినేని అవినాష్, అరవ సత్యం దిష్టిబొమ్మలు తగలబెట్టారు. ఆందోళనకు దిగిన వంగవీటి రాధా అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఇదిలావుంటే, వంగవీటి రాధ రెక్కీ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ సీన్‌లోకి అరవ సత్యం ఎంటరయ్యారు.. అసలు రాధ అనుచరులకు కారణం ఏంటి ? సెక్యూరిటీ వద్దని రాధ ఎందుకు చెబుతున్నారు? రాధ ఎపిసోడ్‌తో బెజవాడలో రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది.

అయితే వంగవీటి రాధా హత్యకు అరవ సత్యం రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలను అతని కుమారుడు ఖండిస్తున్నాడు. తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. తన తండ్రి పోలీసుల అదుపులో లేరని, రెండు రోజులు ఆయన ఐసీయులో ఉన్నాడని తెలిపాడు అరవ సత్యం కుమారుడు తేజ. కొందరు కావాలని తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read Also….Petrol, Diesel Doorstep: ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే డీజిల్, పెట్రోల్.. కావల్సినవారు ఇలా బుక్ చేసుకోండి!