Petrol, Diesel Doorstep: ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే డీజిల్, పెట్రోల్.. కావల్సినవారు ఇలా బుక్ చేసుకోండి!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ పెరిగిపోతోంది. ఈ టెక్నాలజీ ఉపయోగించి మనిషి ఎన్నో పనులను అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నారు. అరచేతిలోనే ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులు ఇవీ. ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని మన సొంతం చేసుకుంటున్నాం.
Petrol, Diesel home delivery: మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ పెరిగిపోతోంది. ఈ టెక్నాలజీ ఉపయోగించి మనిషి ఎన్నో పనులను అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నారు. అరచేతిలోనే ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులు ఇవీ. ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని మన సొంతం చేసుకుంటున్నాం. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ పెరిగిన టెక్నాలజీ ఫలాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయి. సామాన్యుడు కూడా ఈ పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకొని సౌకర్యవంతమైన జీవితం గడపగలుగుతున్నాడు. అన్‌లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక, మనకు కావల్సిన వస్తువును క్షణాల్లో మన ముందుు తెచ్చుకోగలుగుతున్నాం.ఇప్పటివరకు మహానగరాలకు మాత్రమే ఉన్న ఈ సదుపాయం చిన్న చిన్న నగరాలకు పాకుతోంది. మన చేతిలో ఉన్న యాప్ సహాయంతో ఇష్టమొచ్చిన ఫుడ్, నచ్చిన వస్తువును ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ హోం డెలివరీ సిస్టమ్ ఇన్ని రోజులు ఫుడ్, బుక్స్, ఫర్నీచర్, మెడిసిన్, ఇతరత్రా వస్తువులకు మాత్రమే ఉండేది. అయితే తాజాగా మనకు ఎంతో అవసరమైన ఓ ఇంధనం కూడా మన ఇంటికే రాబోతోంది..
ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే మనకు ఈ పెట్రోలియం ఉత్పత్తులు కావాలంటే కచ్చితంగా కచ్చితంగా పెట్రోల్ బంక్ కే వెళ్లాలి. పెరిగిన ట్రాఫిక్‌తో కొన్నిసార్లు క్యూ లైన్‌లో ఉండాల్సిందే. అయితే, ఇక నుంచి ఆ కష్టం తీరిపోనుంది. పెట్రోల్, డీజిల్ అవసరమైన వారికి ఇక హోం డెలివరీ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనిని ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించారు. మంగళవారం రోజు విజయవాడలో అమలు చేశారు. అయితే, ఇందుకోసం బీపీసీఎల్ అనే యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా పెట్రోల్, డీజిల్ ఆర్డర్ పెట్టిన వారికి హోం డెలివరీ చేయనున్నారు. ఇలా, డెలివరీ చేసే సమయంలో ప్రమాదం జరగకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఫెసో క్యాన్ ను ఉపయోగించనున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరం పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటుందని బీపీసీఎల్ అధికారులు వెల్లడించారు. త్వరలోనే అన్ని మేజర్ సిటీస్‌లో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
విజయవాడలోని గాంధీనగర్ పెట్రోల్ పంప్‌లో మంగళవారం ఈ హోం డెలివరీ సిస్టమ్‌ను బీపీఎల్ సౌత్ డీజీఎం ప్రారంభించారు. ఇది ప్రస్తుతం విజయవాడ పట్టణవాసులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. బీపీసీఎల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఈ సౌకర్యం పొందవచ్చని సూచించారు. ఈ హోం డెలవరీ సిస్టమ్ తో పాటు ఫారెన్ లో అమలవుతున్న మరో సిస్టమ్ ను కూడా మంగళవారం ప్రారంభించారు. పెట్రోల్ పంప్ ఉద్యోగులెవరీతో సంబంధం లేకుండా డెరెక్ట్‌గా వినియోగదారుడే బంక్‌లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు. యాపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా అక్కడ ఉన్న స్కానర్ ను స్కాన్ చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ఈ కొత్త సిస్టమ్ పని చేయనుంది.
Read Also… Viral: ఆ షాప్‌లో జ్యూస్ కావాలంటే.. వర్కువట్ చేయాల్సిందే.. క్రేజీ థాట్ గురూ