AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆ షాప్‌లో జ్యూస్ కావాలంటే.. వర్కువట్ చేయాల్సిందే.. క్రేజీ థాట్ గురూ

ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజ్‌ చేయడానికి జిమ్‌కి వెళ్తుంటారు.. అక్కడ వర్కవుట్స్‌ చేసినతర్వాత ఎనర్జీ కోసం జ్యూస్‌ తాగాలనిపిస్తుంది.

Viral: ఆ షాప్‌లో జ్యూస్ కావాలంటే.. వర్కువట్ చేయాల్సిందే.. క్రేజీ థాట్ గురూ
Crazy Thought
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2021 | 11:55 AM

Share

ఆరోగ్యం కోసం ఎక్సర్‌సైజ్‌ చేయడానికి జిమ్‌కి వెళ్తుంటారు.. అక్కడ వర్కవుట్స్‌ చేసినతర్వాత ఎనర్జీ కోసం జ్యూస్‌ తాగాలనిపిస్తుంది. ఏ జ్యూస్‌ షాపులోనో, లేకపోతే ఇంటికి వెళ్లో రెడీగా ఉన్న జ్యూస్‌ని తాగుతారు. కానీ ఇక్కడ ఓ జ్యూస్‌ షాపు ఉంది. ఇది వెరీ స్పెషల్‌. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్లినా వాళ్లు జ్యూస్‌ చేసి ఇవ్వరు. అక్కడ ఎవరి జ్యూస్‌ వాళ్లు తయారు చేసుకోవలసిందే. సెల్ఫ్‌ సర్వీస్‌ అన్నమాట… ఇందుకోసం ఓ ప్రత్యేకమైన టెక్నాలజీని వాడుతున్నారు ఆ జ్యూస్‌ షాపు వాళ్లు.. అదేంటో చూద్దాం రండి…

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో… ది గ్రీనోబార్ అనే ప్రత్యేక జ్యూస్ షాప్ ఉంది.ఈ గ్రీనోబార్‌లో చాలా సైకిల్స్ ఉంటాయి. వాటి ముందు చక్రంపై మిక్సీ జ్యూస్ జార్ పెట్టేందుకు వీలుగా ఏర్పాటు చేసి ఉంది. జ్యూస్ కావాలి అనుకునేవారు సైకిల్ ఎక్కి తొక్కాలి. వారు తొక్కుతూ ఉంటే… జార్‌లో జ్యూస్ తయారవుతూ ఉంటుంది. ఎంత వేగంగా తొక్కితే… అంత వేగంగా జ్యూస్ తయారవుతుంది. ఇలా ఎనర్జీ వేస్ట్ అయితే గానీ జ్యూస్ రాదన్నమాట. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడానికి ఈ కాన్సెప్ట్ ఏర్పాటుచేశారు ఆషాపువాళ్లు. ఎంతైనా కష్టపడి సంపాదించుకున్నది చాలా ఆనందాన్నిస్తుందికదా.. అందుకే ఈ కాన్సెప్ట్ కస్టమర్లకు, నెటిజన్లకూ బాగా నచ్చుతోంది. ఇప్పటివరకూ ఎక్కడా ఇలాంటి జ్యూస్ బార్ లేదు. అందుకే దీనికి సంబంధించిన ఓ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో డిసెంబర్ 6న పోస్ట్ చేసిన ఈ వీడియోని కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. లక్షల్లో లైక్స్‌ చేస్తున్నారు. నిజమండీ… ఇందులో మోహిత్ కేశ్వానీ… సైకిల్ తొక్కుతూ… పుచ్చకాయ జ్యూస్ తయారుచేసుకున్నారు. కస్టమర్లు హార్డ్‌వర్క్ చేసి.. కేలరీలు బర్న్ చేసుకొని ఆ తర్వాత జ్యూస్ తాగుతున్నారు. సాధారణంగా జ్యూస్ తయారీకి కరెంట్ అవసరం. ఇక్కడ ఆ అవసరం లేకుండానే జ్యూస్ తయారవుతోంది. ఆరోగ్యానికీ ఇది మేలే కావడం వల్ల నెటిజన్లు దీన్ని బాగా లైక్ చేస్తున్నారు. కొంత మంది ఆ సైకిల్‌ తమకూ కావాలి అంటున్నారు. మరికొంతమంది జిమ్‌లలో ఇలాంటివి ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు.

Also Read: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్

ఈ ఫోటోలోని చిన్నది.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?