Chandrababu: ఇండియా ప్రపంచ నెంబర్ వన్‌గా ఎదగాలి.. చంద్రబాబు విజన్ 2047.. ఐదు కీలక అంశాలివే..
Chandrababu Vision-2047: భారతదేశం 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాననీ దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. దేశానికి విజన్ ఉండాల్సిన అవసరం ఉందనీ, దీనిలో భాగంగానే ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ అని విజన్ ను రూపొందించానన్నారు.

Chandrababu Vision-2047: భారతదేశం 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాననీ దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. బీచ్ రోడ్ లో రెండున్నర కిలోమీటర్ల జాతీయ సమైక్యతా పాదయాత్ర చేసిన తర్వాత.. ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి విజన్ ఉండాల్సిన అవసరం ఉందనీ, దీనిలో భాగంగానే ఇండియా, ఇండియన్స్, తెలుగూస్ అని విజన్ ను రూపొందించానన్నారు.
చంద్రబాబు విజన్ 2047.. చంద్రబాబు ప్రెజెంట్ చేసిన ఐదు కీలక అంశాలు
ప్రపంచంలో ఇండియా నెంబర్ వన్ కావాలన్నదే నా ఆశయం అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..కోవిడ్ తర్వాత ఎదురైన సవాళ్ళను అధిగమించడానికి నాలెడ్జ్, టెక్నాలజీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడానికి చంద్రబాబు విజన్ 2047ను ప్రతిపాదించారు.. చంద్రబాబు ఫౌండర్ ప్రెసిడెంట్ గా గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టేయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రెజెంట్ చేసిన ఐదు అంశాలు భావితరాల వారికి ఎంతో దోహద పడతాయని చెబుతున్నారు.




విశాఖలో విజన్ 2047 డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు గారి ప్రెజెంటేషన్. గ్లోబల్ లీడర్‌గా భారత్ ఆవిర్భవించేందుకు 5 వ్యూహాలు. 2047 నాటికి దేశం నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రణాళిక దేశం ముందు పెట్టిన చంద్రబాబు గారు#Vision2047WithCBN#AndhraPradesh #NCBN… pic.twitter.com/lZwqWGIcl4
— Telugu Desam Party (@JaiTDP) August 15, 2023
- గ్లోబల్ ఎకానమిగా భారత ఆర్థిక వ్యవస్థ-ప్రపంచ పౌరులుగా భారతీయులు – బహుళ జాతీయ కంపెనీలుగా భారత కార్పొరేట్లు
- డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ – పి 4 మోడల్ సంక్షేమం
- సాంకేతికత, పరిశోధన, సృజనాత్మకత – భావి నాయకత్వం
- ఎనర్జీ సెక్యూర్ ఇండియా – డెమోక్రైటేషన్, డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్
- వాటర్ సెక్యూర్ ఇండియా..సోలార్, విండ్ సౌకర్యాలు
విశాఖలో విజన్ 2047 డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం #Vision2047WithCBN#freedomwalk #AndhraPradesh #NCBN #CBNinVizag#ChandrababuNaidu pic.twitter.com/yoEPUwVGIr
— Telugu Desam Party (@JaiTDP) August 15, 2023
వీటిద్వారా ప్రజలు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. దీన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా విద్యుత్ చార్జీలు పెంచే అవసరం ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశంలో గేమ్ చేంజర్ అవుతుందన్న టీడీపీ అధినేత.. నీరు అత్యంత విలువైనదనీ, నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. టీడీపీ శ్రేణులతో పాటు విశాఖపట్నం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..