Chandrababu: చంద్రబాబు తీవ్ర భావోద్వేగం.. సభలో పరిణామాలపై కన్నీళ్లు.. సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీకి..

ఏపీ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి.

Chandrababu: చంద్రబాబు తీవ్ర భావోద్వేగం.. సభలో పరిణామాలపై కన్నీళ్లు.. సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీకి..
Chandrababu
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 19, 2021 | 1:15 PM

ఏపీ అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యవసాయంపై చర్చ వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి. అంబటి రాంబాబు, చంద్రబాబు మధ్య వాగ్వాదం నడిచింది. ఇరు వైపుల నుంచి పెద్దయెత్తున నినాదాలు చేశారు. అరగంటకు పైగా ఈ గొడవే కొనసాగింది. సభలో పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. అసెంబ్లీ సమావేశాల నుంచి చంద్రబాబు వాకౌట్ చేశారు. తన పరువునే కాకుండా, కుటుంబ పరువును తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభ్యులకు నమస్కరిస్తూ సభ నుంచి నిష్క్రమించారు. సభలో తన భార్య గురించి మాట్లాడటంపై పార్టీ ఎమ్మెల్యేల భేటీలో తీవ్ర ఎమోషనల్ అయిన బాబు.. కన్నీళ్లు పెట్టుకున్నారు. సభలో తన కుటుంబం గురించి మాట్లాడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సవాల్ చేశారు. మళ్లీ గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానన్నారు.

Also Read: Hyderabad: 29 ఏళ్లకే గుండెపోటుతో యువ డాక్టర్ హఠాన్మరణం

ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులు.. వారికి రూ.2వేలు తక్షణ సాయం: సీఎం జగన్