AP Rains: ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులు.. వారికి రూ.2వేలు తక్షణ సాయం: సీఎం జగన్

వర్ష బీభత్సం కొనసాగుతున్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపారు సీఎం జగన్‌. మూడు జిల్లాలకు వెంటనే అధికారులు వెళ్లాలని ఆదేశించారు.

AP Rains: ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులు.. వారికి రూ.2వేలు తక్షణ సాయం: సీఎం జగన్
Cm Jagan
Follow us

|

Updated on: Nov 19, 2021 | 11:12 AM

వర్ష బీభత్సం కొనసాగుతున్న జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపారు సీఎం జగన్‌. మూడు జిల్లాలకు వెంటనే అధికారులు వెళ్లాలని ఆదేశించారు. నెల్లూరుకు సీనియర్‌ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు ప్రద్యుమ్న, కడపకు శశిభూషణ్‌ కుమార్‌లను నియమించారు. జిల్లాల్లోని అధికారులతోనూ మాట్లాడారు సీఎం జగన్‌. బాధితులను ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని స్పష్టం చేశారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలన్నారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పరిహారం వీలైనంత త్వరగా అందించాలన్నారు. వినతులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల నష్టంపై అంచనా వేయాలని.. రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు సరఫరా చేయాలని స్పష్టం చేశారు.  గండ్లు పడ్డ చెరువుల వద్ద యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వాయర్లు, చెరువుల దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా చేస్తూ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు.

తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌. రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో యాత్రికులు కిందకు రాకుండాపైనే ఉంచాలని ఆదేశించారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని స్పష్టం చేశారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు.

వరద బీభత్సం…

కడప జిల్లాలో వరదలతో స్వర్ణముఖి నది ఉధృతితో రోడ్డు తెగిపోయింది. దీంతో రవాణా స్తంభించిపోయింది. సమీప గ్రామాల ప్రజలు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి. అనంతపురం జిల్లా చిత్రవతి నది ఉధృతంగా ప్రవహించడంతో నదిలో 8 మంది చిక్కుకుపోయారు. చెన్నెకొత్తపల్లి దగ్గర చిత్రావతినది ఉధృతంగా ప్రవహిస్తోంది. కడప జిల్లాలో బుగ్గవంక నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ? ఏం ? జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  కడప జిల్లాలో భారీ వరదలతో ఓ ట్రాక్టర్‌ వరదలో చిక్కుకుపోయింది. భారీ వరదలతో కడప జిల్లాలో ఓ బస్సు నదిలో చిక్కుకుపోయింది.

Also Read: Hyderabad: 29 ఏళ్లకే గుండెపోటుతో యువ డాక్టర్ హఠాన్మరణం

 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?