Hyderabad: 29 ఏళ్లకే గుండెపోటుతో యువ డాక్టర్ హఠాన్మరణం.. అది కూడా గాంధీ ఆస్పత్రిలో ఉండగానే

డాక్టర్ అయ్యాడు. మరో 10 రోజుల్లో వివాహ నిశ్చితార్థం ఉంది. అతడి జీవితంలో కొత్త ఫేజ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనుకున్నది జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది.

Hyderabad: 29 ఏళ్లకే గుండెపోటుతో యువ డాక్టర్ హఠాన్మరణం.. అది కూడా గాంధీ ఆస్పత్రిలో ఉండగానే
Doctor Died
Follow us

|

Updated on: Nov 18, 2021 | 11:43 AM

డాక్టర్ అయ్యాడు. మరో 10 రోజుల్లో వివాహ నిశ్చితార్థం ఉంది. అతడి జీవితంలో కొత్త ఫేజ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనుకున్నది జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది. 29 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. యువ డాక్టర్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం ఇప్పుడు అతడి కుటుంబ సభ్యులను, స్నేహితులను విషాదంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. అనంతరం గాంధీ మెడికల్‌ కాలేజీ జనరల్‌ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్‌ చేశారు. గాంధీలోనే సీనియర్‌ రెసిడెంట్‌ విధులు కూడా పూర్తి చేశారు. సూపర్‌ స్పెషాలిటీ కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌ కోసం ఫ్రెండ్స్ కలిసి పద్మారావునగర్‌లో నివాసముంటున్నారు. వారం రోజుల క్రితం అతనికి ఛాతిలో స్వల్పంగా నొప్పి అనిపించింది. వెంటనే  గాంధీలో హెల్త్ చెకప్ చేయించుకోగా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని వచ్చాయి.  బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మరోసారి గుండెల్లో నొప్పి రావడంతో గ్యాస్ వల్ల అనుకుని… గాంధీ ఆస్పత్రికి వచ్చి మెడిసిన్ తీసుకున్నారు. అయితే రూమ్‌కి వెళ్లొద్దని, ఎమర్జెన్సీ విభాగం భవనం పైనున్న పీజీ హాస్టల్‌లో ఉండాలని సహచరులు సూచించడంతో ఆయన సరేనన్నారు. పీజీ హాస్టల్‌కు మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. అతడిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించినా.. ఉపయోగం లేకుండా పోయింది. అప్పటివరకు తమతోనే ఉన్న డాక్టర్ పూర్ణచంద్ర గుప్తా మరణించారని తెలిసి ఆయన సహచరులు, మిత్రులు షాక్‌కు గురయ్యారు.

పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్‌ ప్రకాశరావు, సూపరింటెండెంట్‌ రాజారావు, ఇతర డాక్టర్లు వాళులర్పించారు. అతడి సేవలను ప్రశంసించారు.  అనంతరం అతడి మృతదేహానికి అంత్యక్రియల నిమిత్తం స్వస్థలానికి తరలించారు. యువవైద్యుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!