Bachelors-Marriage: ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. పక్క రాష్ట్రాల్లో పెళ్లికూతుర్ల కోసం వేట..

Bachelors- Marriage: రోజు రోజుకీ దేశం జనాభాలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతుందని అధికారులు చెబుతూనే ఉన్నారు. ఇలా అమ్మాయిల కొరత తీవ్రంమైతే.. భవిష్యత్ లో విపరీత..

Bachelors-Marriage: ఆ రాష్ట్రంలో పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు.. పక్క రాష్ట్రాల్లో పెళ్లికూతుర్ల కోసం వేట..
Tamil Brahmin Bachelors
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2021 | 12:05 PM

Bachelors-Marriage: రోజు రోజుకీ దేశం జనాభాలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గుతుందని అధికారులు చెబుతూనే ఉన్నారు. ఇలా అమ్మాయిల కొరత తీవ్రంమైతే.. భవిష్యత్ లో విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. అయితే తాజాగా అమ్మాయిల కొరతతో అబ్బాయిల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక పోవడంతో చాలా మంది అబ్బాయిలు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. దీంతో ముదిరిపోయిన బెండకాయల్లా మారుతున్న పెళ్లికాని మగపిల్లలను చూస్తూ.. తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. ఓ వైపు ఉద్యోగం, సంపాదన వేటలో పడి యువత పెళ్లి వయసుని దాటేసినా  వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపించడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు తాము పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బయిలకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ లిస్ట్ కూడా పెరిగిపోతుంది. ఇక అన్నీ అనుకూలంగా ఉండి పెళ్లి చేసుకుందామని భావించే అబ్బాయిలకు అమ్మాయిలు దొరకకపోవడంతో.. ఇతర రాష్ట్రాలకు పెళ్లికూతుర్ల కోసం వేటలో పడుతున్నారు.  ముఖ్యంగా తమిళనాడులోని బ్రాహ్మణ యువకులు పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులో 30-10 ఏళ్లు వచ్చిన పెళ్లి కాకుండా 40 వేల మంది బ్రాహ్మణ పెళ్లికాని ప్రసాదులు ఉన్నారట. వీరి  పెళ్లి కోసం యూపీ, బీహార్ లో ఇదే సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కుమార్తెలను వెతికే పనిలో తమిళ బ్రాహ్మణ సంఘం బిజీబిజీగా ఉంది.

తాజా లెక్కల ప్రకారం తమిళనాడులో 10 మంది బ్రాహ్మణ అబ్బాయిలకు ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. దీంతో తమ వర్గానికి చెందిన వారికోసం ఉత్తరాది రాష్ట్రాలవైపు దృష్టి సారించారు. ఉత్తరాది రాష్ట్రల్లో ఢిల్లీ, లక్నో, పట్నా వంటి ప్రాంతాల్లో తమిళ బ్రాహ్మణ సంఘం అమ్మాయిలను వెతికే పనిలో పడింది. ఈ మేరకు హిందీ చదవడం.. రాయడం వచ్చినవారిని అక్కడ కొంతమందిని బ్రాహ్మణ సంఘం మ్యాచ్ మేకర్స్ గా నియమించింది.

ఇదే విషయంపై విద్యావేత్త, M పరమేశ్వరన్ మాట్లాడుతూ.. తమిళనాడు బ్రాహ్మణ సమాజంలో వివాహ పద్ధతులతో కూడా అబ్బాయిలు పెళ్లికాని ప్రసాదుల్లా మిగిలిపోవడానికి కారణమని అంటున్నారు. ఇక్కడ వివాహానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వధువు  కుటుంబమే భరించాలని.. ఇది తమిళ బ్రాహ్మణ సమాజానికి చేటు అని పరమేశ్వరన్ అన్నారు.

అంతేకాదు ఇప్పుడు సమాజంలో పెళ్లిళ్లు స్టేటస్ సింబల్ గా మారిపోయాయని.. ఈ పధ్ధతి చాలా దురదృష్టకరమని అన్నారు.  ఆధునిక సమాజంలో కూడా తమిళ బ్రాహ్మణ వివాహాలు రెండు నుండి మూడు రోజుల వరకు సాగుతాయి. వివాహ వేడుకల్లో భాగంగా రిసెప్షన్ , వివాహానికి ముందు, తరువాత వేడుకలు ఉంటాయి. ఇక పెళ్ళికి నగలు, కళ్యాణ మండపం అద్దె, ఆహారం ఇతర ఖర్చులతో సహా మొత్తం పెళ్లి వేడుక్కి కనీసం రూ. 12-15 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో పెళ్లి వేడుక అంటే వధువు కుటుంబానికి పెద్ద ఆర్థిక భారంగా మారింది.  ఈ పెళ్లి వేడుకలతో ఎక్కువగా నష్టపోతుంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి , పేద బ్రాహ్మణులు. తమ కుమార్తెల పెళ్లిళ్ల కోసం డబ్బులు  సమకూర్చుకోవడానికి పేద బ్రాహ్మణ కుటుంబాలు ఏళ్ల తరబడి కష్టపడుతున్నాయని ఈ విషయం వ్యక్తిగతంగా తనకు తెలుసన్నారు పరమేశ్వర్.  మగ పిల్ల తల్లిదండ్రులు పెళ్లి విషయంలో తమ అహాన్ని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉంటే,.. తమిళనాడులో వధువులు దొరుకుతారని చెప్పారు.

అయితే ఇప్పుడు పెళ్లి కానీ ప్రసాదుల సంఖ్య ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే కాదు.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఇక అమ్మాయిలు కూడా ఇప్పుడు తమకు కాబోయే భర్తల విషయంలో కోరికల లిస్టు విప్పుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు సాఫ్ట్‌వేర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న అబ్బాయిలవైపే మొగ్గుచూపుతున్నారు.

Also Read:  మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సర్పంచ్.. తమ గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ. 10 వేలు డిపాజిట్

క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..