Telangana Sarpanch: మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సర్పంచ్.. తమ గ్రామంలో ఆడపిల్ల పుడితే Rs.10వేలు డిపాజిట్
Telangana Sarpanch: కొంతమంది రాజకీయ నేతలు తమకు లభించిన పదవులను ప్రజలకు మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుని..
Telangana Sarpanch: కొంతమంది రాజకీయ నేతలు తమకు లభించిన పదవులను ప్రజలకు మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లడంలో తమ వంతు పాత్రని నిర్వహిస్తారు. మరికొంత మంది తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు తమ సొంత డబ్బులను కూడా జత చేసి.. తమకంటూ స్పెషల్ ఐడెంటిని క్రియేట్ చేసుకుంటారు. అటువంటి వ్యక్తి అల్లం బాలిరెడ్డి. తనను నమ్మి సర్పంచ్ గా ఎన్నుకున్న గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. దేశంలోనే ఆదర్శగ్రామంగా నిలిపిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి గ్రామ సర్పంచ్ తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామ సర్పంచి అల్లం బాలిరెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిర్మల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న బాలిరెడ్డి.. ఆడపిల్లకు జన్మనిస్తే రూ.10 వేల కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడబిడ్డ పేరుతో బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేస్తామని చెప్పారు.
అంతేకాదు తాను 2019 ఫిబ్రవరిలో సర్పంచిగా పదవి చేపట్టానని.. అప్పటి నుంచి తమ గ్రామంలో ఇప్పటి వరకూ 8మంది ఆడపిల్లలు పుట్టారని చెప్పారు. వారి అందరి పేరుతో ఇప్పటికే డబ్బులను డిపాజిట్ చేశామని తెలిపారు. ఈ డిపాయిట్ చేసిన పత్రాలను ఈనెల 20 వ తేదీన తల్లిదండ్రులకు అందించనున్నామని చెప్పారు. అంతేకాదు తమ గ్రామానికి సర్పంచ్ గా పదవిలో ఉన్నంతకాలం .. ఆడపిల్ల పుడితే.. 10 వేల రూపాయలను డిపాజిట్ చేస్తానని చెప్పారు.
గతంలో గ్రామస్థుల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మినరల్ వాటర్ ప్లాంట్, మొక్కల పెంపకం, డంపింగ్ యార్డులు, వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.
Also Read: బియ్యం నిల్వ చేసుకోవాలా.. పురుగులు పట్టకుండా ఈ సింపుల్ టిప్స్ పాటించించి చూడండి..