Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణం.. సీబీఐని సునీత పదేపదే ఎందుకు కలుస్తున్నారు?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఓ కొలిక్కి వచ్చిందనుకున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి.

YS Viveka Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..  సీబీఐని సునీత పదేపదే ఎందుకు కలుస్తున్నారు?
Ys Viveka
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 18, 2021 | 11:47 AM

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఓ కొలిక్కి వచ్చిందనుకున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ అసలు పేరే వినిపించని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి.. ఇప్పుడు అరెస్ట్ కూడా అయ్యారు. ఉస్మానియాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి అనుమతించడంతో ట్రాన్సిట్‌ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని గురువారం ఉదయం కడపకు తీసుకువచ్చారు. మధ్యాహ్నంలోపు పులివెందుల కోర్టులో సీబీఐ ఆయనను హాజరుపరచనుంది.

మరోవైపు, వివేకా హత్య కేసులో నిన్న హైదరాబాద్‌లో శంకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసింది సీబీఐ- సీబీఐకి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు శంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఈ లేఖలో రాశారు దేవిరెడ్డి – ఉద్దేశపూర్వకంగానే వివేకా కుమార్తె నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.

ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంతో.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రస్తావన రావడం, ఆయన్ను సీబీఐ అదుపులోకి తీసుకోవడంతో మరో మలుపు తిరిగింది. శంకర్ రెడ్డి వైసీపీ నేత అంటూ టీడీపీ టార్గెట్ చేసింది. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడని ఆరోపిస్తోంది. మరోవైపు, శంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి సీబీఐకి రాసిన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలన రేపుతోంది. ఇంతకీ ఈ లేఖలో ఏముందంటే.. హత్యకు మూలకారణం ఏంటో, హత్య చేసిందెవరో సునీతకు తెలుసనీ.. సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి, మరిది శివప్రకాష్‌రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మను సీబీఐ విచారించాలనీ డిమాండ్ చేశారు.మొత్తానికి కేసులో జరుగుతున్న కీలక పరిణామాలలో ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందనేది ఇప్పు ఆసక్తికరంగా మారింది. Read Also…  NIA: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు.. మావోయిస్ట్‌ సానుభూతిపరులే టార్గెట్‌

3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
3 ప్యాన్ ఇండియన్ సినిమాలు.. 1200 కోట్ల బిజినెస్.. సూపర్ ప్లాన్..
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
అరచేతిలో దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా..?జ్యోతిష్యశాస్త్రం
120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
120 ఏళ్ల క్రితం నాటి ఆత్మలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..!
రెస్టారెంట్ స్టైల్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెసిపీ..!
Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి...
Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి వాకింగ్‌ చేస్తూ ఎంటరైన మొసలి...
ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్..
ఇది కదా మీ సత్తా టెస్ట్ చేసే పజిల్..
టర్మ్ లోన్ అంటే ఏంటి... దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు..
టర్మ్ లోన్ అంటే ఏంటి... దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు..
మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ.. అందం, ఆరోగ్యంతో పాటు..
మందారం టీ తాగితే మస్త్‌ బెనిఫిట్స్‌ గురూ.. అందం, ఆరోగ్యంతో పాటు..
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది
ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర ఎంత? ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది
ధోనికి స్ట్రైక్ ఇవ్వని రాచిన్ రవీంద్రపై ఫ్యాన్స్ ఫైర్!
ధోనికి స్ట్రైక్ ఇవ్వని రాచిన్ రవీంద్రపై ఫ్యాన్స్ ఫైర్!
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!