Kitchen Hacks: బియ్యం నిల్వ చేసుకోవాలా.. పురుగులు పట్టకుండా ఈ సింపుల్ టిప్స్ పాటించించి చూడండి..

Bugs In Rice-Kitchen Hacks: చల్లటి, పొడి ప్రదేశాల్లో గాలి చొరబడని కంటైనర్లలో బియ్యం, పప్పు వంటి వాటిని నిల్వ చేస్తారు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకున్నా..

Kitchen Hacks: బియ్యం నిల్వ చేసుకోవాలా.. పురుగులు పట్టకుండా ఈ సింపుల్ టిప్స్ పాటించించి చూడండి..
Bugs In Rice
Follow us

|

Updated on: Nov 18, 2021 | 10:30 AM

Bugs In Rice-Kitchen Hacks: చల్లటి, పొడి ప్రదేశాల్లో గాలి చొరబడని కంటైనర్లలో బియ్యం, పప్పు వంటి వాటిని నిల్వ చేస్తారు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకున్నా.. బియ్యంలో పురుగులు పడతాయి. దీంతో బియ్యాన్ని శుభ్ర చేసుకోవడం కోసం చాలా కష్టపడతారు. ఒకొక్కసారి బియ్యం వృధాగా పారబోయాల్సి కూడా ఉంటుంది. అయితే  బియ్యంలో పురుగులు పట్టడం అనేది సర్వ సాధారణ విషయం. ముఖ్యంగా బియ్యం నిల్వ అయ్యి.. పాత బియ్యంగా మారుతూనే.. ఈ పురుగుల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది.  ఒకొక్కసారి బియ్యంలో పురుగులు కంటికి కనిపించేవిగా ఉంటే.. కొన్ని సార్లు బియ్యంలో కలిసి.. కనిపించడం కష్టంగా ఉంటుంది. అయితే బియ్యంలో పురుగులు పట్టకుండా ముందుగా కొన్ని టిప్స్ ను పాటిస్తే.. పురుగులు పట్టకుండా చూసుకోవచ్చు. ఈరోజు సింపుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం..

*బియ్యం నిల్వ చేసే కంటైనర్ లో తడి లేకుండా చూసుకోవాలి. అనంతరం బియ్యం లో కొన్ని బిరియానీ ఆకులు కానీ  కొన్ని వేపాకులు కానీ వేసుకుంటే బియ్యంలో పురుగులు దరిచేరవు. *బియ్యం నిల్వ చేసిన డబ్బాలను పెట్టుకునే ప్రాంతంలో క్రిమి కీటకాలు దరిచేరకుండా లవంగం నూనె సహాయపడుతుంది. డబ్బాలు పెట్టడానికి ముందు ఆ ప్రాంతంలో లవంగం నూనెను ముందుగా రాయాల్సి ఉంటుంది. *బియ్యంలో పురుగులు పట్టకుండా లవంగాలు ఉపయోగపడతాయి. ముందుగా లవంగాలను తీసుకుని, పొడిగా చేసుకుని ఆ పొడిని పల్చని వస్త్రం లో కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. దీంతో బియ్యంలో పురుగులు పట్టవు. *బియ్యానికి పురుగులు పట్టినప్పుడు లేదా పురుగులు పట్టకుండా ఉండాలన్న కూడా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేయవచ్చు లేదా ఒక కాటన్ వస్త్రం లో చుట్టి బియ్యం లో వేస్తె సమస్య తగ్గుతుంది. *రాళ్ళ ఉప్పును కాటన్ వస్త్రం లో చుట్టి బియ్యం డబ్బాలో లేదా బియ్యం సంచిలో వేస్తె పురుగులు పట్టవు. *ఎండిన కాకరకాయ ముక్కలను ఒక పొడి క్లోత్ లో వేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యంలో పెట్టడం వలన కూడా పురుగు పట్టదు. *బియ్యంలో పురుగులు పట్టకుండా నిల్వ చేసే ముందు ఎండలో ఆరబోసుకోవాలి. అనంతరం తడి తగలని ప్లేస్ లో నిల్వ జేసుకోవాలి. *ఒకవేళ బియ్యానికి పురుగులు పడితే.. ఆ బియ్యాన్ని ఎండలో ఆరబోసి.. అనంతరం శుభ్రం చేసుకుని మళ్ళీ నిల్వజేసుకోవాలి.

Also Read:  330 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన బీచ్.. ప్రపంచంలోనే మొదటి బీచ్ ఎక్కడ ఏర్పడిందో తెలుసా..