చలికాలంలో ఏలాంటి చర్మానికి ఏ ఫేస్ మాస్క్ షీట్ మంచిదో తెలుసా.. అయితే మీకోసం ఈ విషయాలు..
చలికాలంలో చర్మ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. చర్మం సులువుగా పొడిబారుతుంటుంది. అందుకు అనుగుణంగానే
చలికాలంలో చర్మ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. చర్మం సులువుగా పొడిబారుతుంటుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు చర్మ సమస్యలను తగ్గించుందేకు వివిధ రకాల క్రీమ్స్, మాశ్చరైజర్స్, మాస్క్ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాస్మోటిక్ పరిశ్రమలో వివిధ విషయాలు కనుగొంటున్నాయి. సరికొత్తగా మాస్క్ షీట్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మాస్క్ ల ద్వారా అరగంటలో చర్మాన్ని పోషణ, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ఇవి అన్ని రకాల చర్మాల వారికి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో క్షణాల్లో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇక చలికాలంలో మీ చర్మానికి తగినట్టుగా ఏ మాస్క్ షీట్ ఉపయోగించాలో తెలుసుకుందామా.
* జిడ్డు చర్మం ఉన్నవారు టీ ట్రీ షీట్ మాస్క్, సహజ తేనె షీట్ మాస్క్ చాలా మంచివి. ఇవి చర్మానికి పోషణ ఇవ్వడమే కాకుండా..రంధ్రాలను శుభ్రం చేస్తుంది. * ఇక పొడి చర్మం ఉన్నవారు నిమ్మకాయ షీట్, అలోవెరా షీట్, సీవిడ్ షీట్ ఉపయోగించవచ్చు. వీటిని ప్రత్యామ్యాయ రోజులలో ఉపయోగించవచ్చు. లెమన్ ఫేస్ షీట్ చర్మమాన్ని హైడ్రేట్ చేయడంతోపాటు.. మెరిసేలా చేస్తుంది. అలోవెరా షీట్ చర్మాన్న మృదువుగా చేస్తుంది. సీవిడ్ షీట్స్ చర్మాన్ని శుద్ది చేస్తాయి. * సున్నితమైన చర్మం ఉన్నవారు బంగాళదుంప షీట్, చమోమిల్లా ఫేస్ షీట్ ఉపయోగించవచ్చు. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి6, కాపర్, జింక్ ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మానికి మేలు చేస్తాయి. * మొటిమల సమస్య ఉన్నవారికి రైస్ షీట్, మాకియోలి షీట్ ఎక్కువగా పనిచేస్తాయి. * ఇక ముఖంపై ముడతలు ఎక్కువగా వచ్చేవారు.. వృద్దాప్యం పెరుగుతున్నవారు బ్లూ బెర్రీ, రెడ్ వైన్, దానిమ్మ వంటి ఫేస్ షీట్స్ మంచివి.
Also Read: Balakrishna: బాలకృష్ణ-గోపిచంద్ మలినేని సినిమా పై సరికొత్త గాసిప్.. అదెంటంటే..
Digilocker: మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. అన్ని డాక్యుమెంట్లు భద్రంగా దాచుకోవచ్చు..!